మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు నందీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో పఠాన్ చెరులో నిర్వహించిన రేణుక ఎల్లమ్మ తల్లి జాతరలో తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నాను. అనంతరం ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా.. 120 ఏళ్ల క్రితం వెలిసిన రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకున్న, అమ్మవారిని చూడగానే నా ఒళ్ళు పులకరించిందన్నారు బండి సంజయ్. పంచభూతాలను దేవుడుగా ఆరాధించే సంస్కృతి మన హిందూ సంప్రదాయమని, 2005 నుండి 2011 వరకు హిందూ సాంప్రదాయాల పైన కొట్లాడి ఏడు సార్లు జైలుకు వెళ్ళొచ్చానన్నారు.
Also Read : Arvind Kejriwal: డర్టీ పాలిటిక్స్.. మనీష్ సిసోడియా అరెస్టుపై అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం
హిందువు అనేవాడు, ఎవడైనా హిందు ధర్మాన్ని గానీ, హిందూ దేవుళ్లను గానీ, కించపరిచినప్పుడు ఎదురు తిరిగి సమాధానం చెప్పాలన్నారు. కాశీ మహానగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దిన ఘనత మోడీదని, జన్మలో ఒక్కసారైనా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలన్నారు బండి సంజయ్. అయ్యప్పను విమర్శించిన వాడి పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసనని, ధర్మాన్ని కించపరిచినట్లు ఎవరు మాట్లాడిన వారికి అదే పరిస్థితి పడుతుందన్నారు.
Also Read : Kasturi: అనసూయ ఆంటీ వివాదంపై.. కస్తూరి ‘డర్టీ’ మీనింగ్
80శాతం హిందువులు ఉన్న భారతదేశంలో రామ మందిరం నిర్మించడానికి ఎన్నో కొట్లాటలు జరిగాయని, మూలాయం సింగ్ హయాంలోని రామ మందిర నిర్మాణం కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆ రోజుల్లో నేను ఒక కర సేవకునిగా ఎన్నో దెబ్బలు తిన్నానని, ఈరోజు మనం రామ మందిరాన్ని ఎంతో సుందరంగా నిర్మించుకుంటున్నామన్నారు బండి సంజయ్.