మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ కి రంగం సిద్ధమవుతోంది. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో మెగా నందమూరి అభిమానులు హిట్ మేము కొడతాం అంటే మేము కొడతాం అంటూ పోటి పడుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా జరుగుతున్న ఈ బాక్సాఫీస్ రైవల్రీని పక్కన పెట్టి చిరు, బాలయ్యలని ఒకే వేదికపై చూడాలని ఎంతో మంది సినీ అభిమానులు కోరుకుంటూ ఉంటారు. మాస్ కి డెమీ గాడ్స్ లాంటి ఈ ఇద్దరు హీరోలు చాలా అరుదుగా కలిసి కనిపిస్తూ ఉంటారు. ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ కోసం చిరంజీవి, అన్ స్టాపపబుల్ షోకి గెస్ట్ గా వస్తే… చిరు, బాలయ్యలని ఒకే స్టేజ్ పై చూడొచ్చు అని ఎంతోమంది సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఇంతలో “నేను, చిరంజీవి కలిసి నటిస్తే అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది” అంటూ మాట్లాడి బాలయ్య సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
ప్రస్తుతం బాలకృష్ణ ‘అన్ స్టాపపబుల్’ టాక్ షో చేస్తున్నాడు, సీజన్ 2 జరుగుతున్న ఈ షోలో 5వ ఎపిసోడ్ లో గెస్ట్ లుగా… ‘అల్లు అరవింద్, రామానాయుడు, రాఘవేంద్ర రావు, కొండదరామి రెడ్డి వచ్చారు. ఈ ఫ్రైడే రిలీజ్ అవ్వనున్న ఈ ఎపిసోడ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో అల్లు అరవింద్ ని బాలకృష్ణ “మన కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు?” అని అడిగాడు. ఈ ప్రశ్నకి సమాధానంగా “మిమ్మల్ని చిరంజీవి గారిని కలిపి ఒక సినిమా చేయాలని ఉందని” అల్లు అరవింద్ చెప్పడంతో బాలయ్య మోహంలో చిరునవ్వు కనిపించింది. క్షణం ఆగిన బాలయ్య “నేను, చిరు కలిసి సినిమా చేస్తే అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది” అనేసాడు. ఈ ప్రోమో చూసిన వాళ్లందరూ… అల్లు అరవింద్ అంటే అన్నాడు కానీ చిరు, బాలయ్యలు ఒక సినిమాలో నటిస్తే అనే ఊహ ఎంత బాగుందో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. నిజంగానే చిరంజీవి, బాలకృష్ణలు నటించడానికి ఒప్పుకున్నా కూడా పవర్ హౌస్ లాంటి హీరోలని ఒక దగ్గర బాలన్స్ చేసి చూపించే కథ దొరకదు, ఆ కథని డైరెక్ట్ చేసే దర్శకుడూ ఉండడు. ఇదే మాటని సినిమాటిక్ స్టైల్ లో చెప్పాలి అంటే “చరణ్, ఎన్టీఆర్ లని బాలన్స్ చేసి చూపిస్తూ అభిమానులని సంతోషపరచడం రాజమౌళి వల్లే కాలేదు అంటే రాజమౌళి మీదొట్టు ఇంకెవ్వరి వల్ల కాదు”. పైగా అక్కడ ఉన్నది చరణ్, ఎన్టీఆర్ కాదు వాళ్ల బాబులు. బాలన్స్ చేయడం అనేది తలకిందులుగా తపస్సు చేసిన జరగని పని.