బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం శ్రీ శృంగేరీ శంకరాచార్య మహా సంస్థానం, దక్షిణాంన్యాయ శ్రీ శ్రంగేరి శారదా పీఠాధీశ్వర్వులు భారతీ తీర్థ స్వామి వారిని దర్శించుకున్నారు. వారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం శారదా అమ్మవారిని దర్శించుకుని చంద్రమౌళీశ్వర పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీ తీర్ధస్వామి వారు తెలంగాణలోని వివిధ ధార్మిక కార్యక్రమాలను బండి సంజయ్ కు వివరించారు. ధర్మం కోసం పాటుపడాలని సూచించారు. ధర్మం విషయంలో ఏ సమస్య వచ్చినా ముందుండాలని పేర్కొన్నారు.
అయితే.. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు మేనియా నడుస్తోంది. మునుగోడుపై అధికార టీఆర్‌ఎస్‌తో పాటు, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎంతో ఆశతో ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న టీఆర్‌ఎస్‌కు, మరోసారి తెలంగాణ పుంజుకోవాలనుకుంటున్న కాంగ్రెస్‌కు, తెలంగాణలో కాషాయజెండా ఎగురవేయాలనుకునే బీజేపీకి ఈ ఉప ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. అయితే.. దీనితో ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే నవంబర్ 3న ఈ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగనుండగా.. 6న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.