Maharashtra: వాస్తుదోషాల పేరుతో మహిళపై పదేపదే అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: తప్పుడు మాటలు చెబుతూ, చేతబడులను, దోషాలను వదిలిస్తామంటూ కొందరు బాబాలు, మాంత్రికులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో వాస్తుదోషాలు, చెడు దోషాలు వదిలిస్తానని చెబుతూ 35 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా బాధితురాలి భర్త స్నేహితులే అని పోలీసులు వెల్లడించారు. మహిళ భర్తకు ఏదో చెడు శక్తి ఆవహించిందని, ఇవన్నీ తొలిగిపోవాలంటే కొన్ని ఆచారాలు చేయాలని వారు మహిళకు చెప్పారు. నిందితుడు ఏప్రిల్ 2018 నుంచి బాధితురాలి ఇంటికి తరుచూ వస్తున్నాడు. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో కొన్ని పూజలు చేస్తాడు. పంచామృతం అని పిలిచే ఓ డ్రింక్ ఇచ్చి ఆమెపై అత్యాచారం చేసేవాడని పోలీసులు తెలిపారు.
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
Read Also: Anantnag Encounter: 5 రోజులుగా ఎన్‌కౌంటర్.. ఇంకా చిక్కని ఉగ్రవాదులు.. ఆర్మీకి సవాళ్లు..
భర్తకు నయం కావాలని, ప్రభుత్వం ఉద్యోగం దొరకాలని ఆ మహిళ, నిందితుడు చెప్పిందల్లా వినడమే కాకుండా బంగారం, డబ్బును కూడా ఇచ్చింది. 2019లో థానెలోని యూర్ ఫారెస్ట్ లో కందివాలిలో ప్రధాన నిందితుడు ఆమెపై అత్యాచారం చేశాడు. నిందితులంతా ఆమె దగ్గర నుంచి రూ. 2.1 లక్షలతో పాటు బంగారం తీసుకున్నారు. గిరిజనులు ఎక్కువగా ఉండే తలసరి అనే ప్రాంతానికి చెందిన మహిళ సెప్టెంబర్ 11న ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులు రవీంద్ర భాటే, దిలీప్ గైక్వాడ్, గౌరవ్ సాల్వి, మహేంద్ర కుమావత్ , గణేష్ కదమ్‌లను అరెస్టు చేశారు.
అయితే, మహిళపై ఒక్కరే అత్యాచారం చేశారా..? నిందితులు ఐదుగురు ఈ దురాగతానికి ఒడికట్టారా..? అనే విషయాలను కనుగొనాల్సి ఉందని పోలీస్ అధికారి విజయ్ ముతాడక్ తెలిపారు. ఐదుగురిపై ఐపీసీ సెక్షన్లు 376 (రేప్) 376 (2) (n) (ఒకే మహిళపై పదేపదే అత్యాచారం చేయడం) 420 (మోసం) కింద అభియోగాలు మోపినట్లు పాల్ఘర్ ఎస్పీ బాలాసాహెబ్ పాటిల్ తెలిపారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!