Bigg Boss 7 Telugu : వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీ అవుతున్న ఆ ఇద్దరు ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 సీజన్ గత సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ కాస్త కొత్తగా ఉండేలా యాజమాన్యం ప్లాన్ చేస్తుంది.. గత వారం ఎలిమినేషన్ అయ్యింది.. ఈ వారం సస్పెన్స్ లతో మరో ఇద్దరినీ హౌస్ లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.. ఈసారి హౌస్ లోకి 14 మంది మాత్రమే రాగా.. మరో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఫస్ట్ వీక్ నుంచే గట్టిగా గొడవలు, ప్రేమలు ఏడుపులతో హౌస్ అంతా ఉత్కంఠగా సాగుతోంది. అయితే ప్రతీసారి హౌస్ లోకి 16 మంది కంటస్టెంట్స్ సందడి చేసేవారు. అయితే మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండేది. ఈ సారి మాత్రం రావడమే 14 మంది హౌస్ లోకి వచ్చారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రంగం సిద్ద అవుతున్నట్టు తెలుస్తోంది..
సీజన్ 7 లో వచ్చిన కంటెంస్టెంట్స్ పెద్దగా జనాలకు తెలిసిన వాళ్లు కాదు.. సీరియల్స్ రెగ్యూలర్ గా చూసేవారికి మాత్రం అందులో ఓ నలుగురు బాగాపరిచయం ఉండి ఉంటారు. అంత తప్పించి గత సీజన్ లో ఉన్నవారిలో కంటే.. ఈసారి ఉన్నవారు పరిచయం లేని ముఖాలు ఎక్కువగా ఉన్నాయి. ఈక్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.. అదేంటంటే..వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అయితే కాస్త తెలిసిన ముఖాలను తీసుకురావాలి అనిచూస్తున్నారట. అందుకు తగ్గట్టుగా ఇద్దరు కంటెస్టెంట్స్ ను ఇప్పటికే రెడీ చేసినట్టు తెలుస్తోంది. అందులో మరీ ముఖ్యంగా అర్జున్ అంబటి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. పలు సీరియల్స్ లో హీరోగా.. టోన్డ్ బాడీతో.. అమ్మాయిల మనసుల్లో రొమాంటిక్ ఇమేజ్ సాధించాడు అర్జున్..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇకపోతే అర్జున్ తో పాటుగా సుప్రీతను కూడా హౌస్ లోకి దించే ప్రయత్నం చేస్తుంది బిగ్ బాస్..సుప్రీత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు. తల్లీ కూతరు కలిసి నెట్టింట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరు ఈ వీక్ లోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. స్టార్ మాలో సైతం పలు సీరియల్స్‌లో హీరోగా నటించి మెప్పించిన అర్జున్.. కేవలం యాక్టర్‌గా మాత్రమే కాకుండా డ్యాన్సర్‌గా, యాంకర్‌గా తనలోని మల్టీ టాలెంట్స్‌ను బయటపెట్టాడు. ఇక ఈసారి సీజన్ లో సీరియల్ స్టార్స్ హవా ఎక్కువైపోయిందనే చెప్పాలి.. మరో రెండు వారాల తర్వాత మరో ఇద్దరినీ హౌస్ లోకి దించే ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్..
తాజావార్తలు
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..