Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay Fires On Trs Government 2

Bandi Sanjay : మంత్రులను, ఎమ్మెల్యేలను మనుగోడు నుండి పంపకపోతే… నేనూ వస్తా

Published Date :November 2, 2022 , 5:16 pm
By Gogikar Sai Krishna
Bandi Sanjay : మంత్రులను, ఎమ్మెల్యేలను మనుగోడు నుండి పంపకపోతే… నేనూ వస్తా
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక మేనియా నడుస్తోంది. అయితే.. నిన్న సాయంత్రానికే మునుగోడు ఉప ఎన్నికల ప్రచార సమయం ముగిసింది. ఈ నేపథ్యంలో స్థానికేతరులు మనుగోడు నియోజకవర్గాన్ని వదిలివెళ్లాలని ఎన్నికల అధికారలు అదేశించారు. ఈ క్రమంలోనే కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు ఇంకా మునుగోడు నియోజకవర్గంలో పాగ వేశారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల సంఘం, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు తలొగ్గి పనిచేస్తున్నారని మండిపడ్డారు.

Also Read : MP K.Laxman : మీ పార్టీ కుటుంబ పార్టీ అని మరోసారి రుజువయ్యింది
తక్షణమే స్థానికేతరుల మంత్రులను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, వారి అనుచరులను మునుగోడు నుండి తక్షణమే పంపకపోతే…. అవసరమైతే తానే మునుగోడు వస్తానని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలంతా తరలిరావాలని పిలుపునిచ్చే పరిస్థితి రానీయొద్దని సూచించారు. టీఆర్ఎస్ గూండాల రాళ్లదాడిలో మూడు రోజుల క్రితం గాయపడి వనస్థలిపురంలోని ఇవ్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ కార్యకర్త ప్రతాప్ రెడ్డిని, ఎన్నికల ప్రచారానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కార్యకర్త రమేశ్ యాదవ్ ను మలక్ ఫేట యశోద ఆసుపత్రిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రబాకర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు జె.సంగప్ప, రాణి రుద్రమదేవి తదితరులతో కలిసి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాళ్ల దాడి ఘటన, రోడ్డు ప్రమాద ఘటన పూర్వాపరాలను ఆరా తీశారు.

Also Read : Jagadish Reddy : ఐటీ దాడులపై స్పందించిన మంత్రి జగదీష్‌ రెడ్డి..
ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ‘‘నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో టీఆర్ఎస్ లాంటి నీచమైన పార్టీని, కేసీఆర్ లాంటి మోసగాడిని ఇంతవరకు చూడలేదు. ఓడిపోతామనే భయంతో మంత్రి మల్లారెడ్డి రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నరు. కేసీఆర్ పచ్చి అబద్దాలాడుతున్నడు. రాళ్లు, కర్రలతో తెగబడుతున్నరు. నాతోపాటు అక్కడున్న అమాయకులైన ప్రజలకు దెబ్బలు తగిలినయ్. ఏం జరుగుతుందో తెల్వని పరిస్థితి. కరెంట్ షాక్ కొట్టినట్లుగా అన్పించింది’’అని వాపోయారు.
Also Read : MP K.Laxman : మీ పార్టీ కుటుంబ పార్టీ అని మరోసారి రుజువయ్యింది

వెంటనే బండి సంజయ్ స్పందిస్తూ… తొందరగా కోలుకోవాలని, మీకు అండగా పార్టీ ఉందని భరోసా ఇచ్చారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని తేలడంతో ఆ పార్టీ నేతలు తప్పతాగి కండకావరంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలపై రాళ్ల దాడి చేస్తు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితోపాటు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు తమ కాన్వాయ్ ను అడ్డుకుంటూ దాడికి యత్నించారని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో సామాన్య ప్రజలు, పేదలెందరో ఉంటారని… ఇంత బరితెగించి చేసే దాడులతో సామాన్య ప్రజల ప్రాణాల పరిస్థితి ఏమిటనే కనీస ఆలోచన లెకుండా దాడులు చేస్తున్నారని అన్నారు.

ఒక ఉప ఎన్నిక గెలవడానికి ఇంత నీచానికి దిగాలా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల గూండాగిరి, రాళ్ల దాడి, మందు, మాంసం, మనీ పంపిణీని చూసి జనం అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఏ పార్టీ నేతలు చేసినా ఇలాంటి సంస్ర్కుతి మంచిది కాదన్నారు. ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ ఫాల్తుగాళ్లు, బట్టేబాజ్ గాళ్లు తాను రాజీనామా చేశానంటూ ఫేక్ లెటర్లు స్రుష్టించి ప్రజలను గందరగోళం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోయేవాళ్లే దాడులు చేస్తే.. గెలిచే పార్టీ… గెలిపించే ప్రజలు తిరగబడితే తట్టుకోగలరా? అని ప్రశ్నించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • breaking news
  • latest news
  • munugode bypoll
  • TRS

తాజావార్తలు

  • Rishab Shetty: ఎన్టీఆర్ హీరోయిన్‌కు రిషబ్ శెట్టి షాక్.. ‘కాంతార’లో అసలేమైంది?

  • New Rules for Coaching Centers: ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు కొత్త నిబంధనలు.. ఉల్లంఘిస్తే అంతే..!

  • CM Revanth Reddy: “ఇది శివదీక్ష.. ఎవ్వరూ ఆపలేరు”.. మూసీ ప్రాజెక్టు అడ్డుకునే వారికి సీఎం స్ట్రాంగ్ కౌంటర్!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • Varun Tej Bari: బాబాయ్ బ్లెస్సింగ్స్‌తో ‘బరి’లోకి దిగిన వరుణ్ తేజ్!

ట్రెండింగ్‌

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions