Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు
- మురసుగా మారిన తీవ్ర వాయుగుండం
- నవంబర్ 2న తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం
- నెల్లూరు-నర్సాపురం మధ్య తీరం దాటే సూచనలు
- మత్స్యకారులకు హెచ్చరికలు.. తీర జిల్లాల్లో అప్రమత్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత తీవ్రరూపం దాల్చి ‘మురసు’ తుఫాన్‌గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఇది వేగంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తుండటంతో దక్షిణ కోస్తాంధ్రతో పాటు ఉత్తర తమిళనాడు తీరప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ ధాటికి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ఈదురుగాలులు విరుచుకుపడే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
తీరానికి చేరువగా ‘మురసు’.. వేగంగా కదులుతున్న రాక్షస గాలులు
ఆదివారం ఉదయం 11:30 గంటల సమయానికి ఈ తుఫాన్ నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 560 కి.మీ, నెల్లూరుకు 630 కి.మీ, మచిలీపట్నానికి 640 కి.మీ, విశాఖపట్నానికి 660 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత ఆరు గంటలుగా గంటకు 23 కిలోమీటర్ల వేగంతో ఇది పశ్చిమ వాయవ్య దిశగా అడుగులు వేస్తోంది.
Also Read
- Nara Lokesh : పులివెందులలో శాంతిభద్రతల సమస్యకు జగనే కారణం
- Municipal Elections: కర్నూల్ జిల్లాలో పోటెత్తిన ఓటర్లు.. రాష్ట్రవ్యాప్తంగా 3 గంటల సమయానికి 48.03 శాతం ఓటింగ్ నమోదు..
- YS Jagan: ఓటు వేయకుండానే వెనుదిరిగిన మాజీ సీఎం జగన్.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..
- CM Chandrababu: గతంలో ఎన్నడూ లేనంతటి స్ఫూర్తి కనిపిస్తోంది.. స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..
నవంబర్ 2న తీవ్ర తుఫాన్‌గా.. గంటకు 120 కిమీ వేగంతో విలయం
ఐఎండీ అంచనాల ప్రకారం.. ‘మురసు’ తుఫాన్ రాబోయే 24 గంటల్లో మరింత బలపడి నవంబర్ 2వ తేదీ ఉదయం నాటికి ‘తీవ్ర తుఫాన్’ (Severe Cyclonic Storm)గా మారనుంది. అనంతరం వాయవ్య దిశగా పయనిస్తూ నవంబర్ 2వ తేదీ రాత్రి 11:30 గంటల నుంచి తెల్లవారుజాము 4:00 గంటల మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనుంది. ముఖ్యంగా నెల్లూరు-నర్సాపురం మధ్యలో ఇది తీరం దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తీరం దాటే సమయానికి గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులు వీచే ప్రమాదం ఉంద నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీరప్రాంత జిల్లాల్లో హైఅలర్ట్.. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు ఆదేశాలు
పరిస్థితి తీవ్రతను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరప్రాంత జిల్లాల యంత్రాంగాన్ని ముందస్తుగా అప్రమత్తం చేసింది. ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు తక్షణమే సమీప తీరాలకు తిరిగి రావాలని అత్యవసర సూచనలు జారీ చేశారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు
-
Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
-
Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
-
Mallikarjun Kharge: జ్ఞానేష్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వదలం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
-
Nara Lokesh : పులివెందులలో శాంతిభద్రతల సమస్యకు జగనే కారణం
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!