SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్న వాళ్లకు చేదు వార్త. కార్డుతో భారీగా పెట్రోల్ కొట్టించినా, పెద్ద మొత్తంలో టికెట్ బుకింగ్స్ చేసినా ఇకపై అదనంగా ఛార్జీలు వసూలు చేయాలని ఎస్బీఐ కార్డ్ నిర్ణయించింది. ఈ కొత్త ఫీజు రూల్స్ 2026 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు అక్టోబర్ 27న కంపెనీ అధికారికంగా నోటీసు ఇచ్చింది.
తాజా రూల్స్ ప్రకారం.. ఒక నెల బిల్లింగ్ సైకిల్లో పెట్రోల్, డీజిల్ కోసం కార్డుతో చేసే మొత్తం ఖర్చు రూ.50,000 దాటితే, ఆ నెలలో చేసిన మొత్తం అమౌంట్‌పై 1 శాతం ఫీజు బాదనున్నారు. ఇది కేవలం రూ.50 వేలకు పైబడిన మొత్తంపై మాత్రమే కాదు, ఆ నెలలో పెట్రోల్ కోసం పెట్టిన పూర్తి ఖర్చుపై పడుతుంది. అంటే ఒక నెలలో మీ పెట్రోల్ బిల్లు రూ.55,000 అయితే, నేరుగా రూ.550 ఎక్స్ట్రా కట్టాల్సిందే. అదే మొత్తం రూ.75,000 దాటితే ఏకంగా రూ.750 జేబు నుంచి సమర్పించుకోవాలి. అయితే నెల మొత్తం మీద పెట్రోల్ ఖర్చు రూ.50 వేల లోపే ఉంటే ఎలాంటి ఎక్స్ట్రా ఫీజు పడదు.
Also Read
- GST Collection: జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
- Commercial LPG Price Hike: దీపావళికి ముందు షాక్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు..
- EPFO 74th Foundation Day: EPFO శుభవార్త.. ఇక వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్, రూ.1,000 వరకు పాత ఖాతాలకు ఆటో సెటిల్మెంట్!
- Petrol Export Duty Cut to Zero: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు, డీజిల్‌పై భారీ పెంపు
మరోవైపు ఫ్లైట్, ట్రైన్, బస్సు టికెట్లు లాంటి ట్రావెలింగ్ బుకింగ్స్‌కు సంబంధించి ఒక్కో పేమెంట్ విలువ రూ.30,000 దాటితే, ఆ సింగిల్ పేమెంట్‌పై 1 శాతం ఫీజు వేస్తారు. సంబంధిత మర్చంట్ కోడ్స్ (MCC 4111, 4784, 4131) కింద జరిగే లావాదేవీలకే ఈ రూల్ వర్తిస్తుందని బ్యాంక్ స్పష్టం చేసింది. అంటే ఒకేసారి రూ.35,000 పెట్టి టికెట్లు బుక్ చేస్తే రూ.350, అదే రూ.50,000 స్వైప్ చేస్తే రూ.500 అదనపు ఛార్జ్ పడుతుంది. అయితే రూ.30,000 లోపు చేసే చెల్లింపులపై ఎటువంటి ఫీజు ఉండదు. కార్డుతో తరచూ ఫ్యామిలీ టూర్స్ లేదా ఆఫీస్ పనుల కోసం పెద్ద మొత్తంలో టికెట్లు బుక్ చేసేవాళ్లు, వ్యాపారాల కోసం భారీగా పెట్రోల్ కొట్టించేవాళ్లు.. అనవసరంగా ఫైన్లు, ఛార్జీలు పడకుండా చూసుకోవాలంటే డిసెంబర్ 1 నుంచే తమ నెలవారీ లిమిట్లపై కన్నేసి ఉంచడం మంచిది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
-
Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు
-
Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
-
Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
-
Mallikarjun Kharge: జ్ఞానేష్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వదలం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!