మన్నెగూడలో జరుగుతున్న బీజేపీ వర్క్ షాప్‌లో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నలుగురు జిల్లా కలెక్టర్లు రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు ఆస్తులు కూడబెడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ధరణి పేరుతో అడ్డగోలుగా సంపాదించి కేసీఆర్ కుటుంబానికి దోచి పెడుతున్నారంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చేస్తునందుకు ఆ కలెక్టర్‌లు పదోన్నతులు పొందుతున్నారని, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించామన్న బండి సంజయ్.. త్వరలోనే ఈ వ్యవహారం బట్టబయలు చేస్తామన్నారు. ఇదే కాకుండా.. ఈ నలుగురు కలెక్టర్‌లే ప్రగతి భవన్‌లో పనులు చక్కబెడుతున్నారని, ఇలాంటి వారి వల్ల రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకువస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఈ నలుగురు కలెక్టర్లపై సేకరించిన ఆధారాలను కేంద్రంకు సమర్పిస్తామని, డీఓపీటీకి ఫిర్యాదు చేయనున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు. అయితే.. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ నలుగురు కలెక్టర్‌లు ఎవరా..? అని రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది.
Also Read : PM Narendra Modi: ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది.. కొందరు దేశ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇదిలా ఉంటే.. నిన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. 119 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయాలని.. అప్పుడు ఆ పార్టీకి డిపాజిట్లు వస్తాయో లేదో చూద్దామంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల్లో బడ్జెట్‌పై చర్చ లేదని.. మాటలు తప్ప చేతల్లేవని అన్నారు. కేటాయింపులు ఘనం..ఖర్చులు స్వల్పమని ఎద్దేవా చేశారు.
Also Read : USA: విమానంలో ల్యాప్‌టాప్‌కు మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్..