ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. గద్దర్ అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. అయితే, ఎల్బీ స్టేడియంలో ఉంచిన గద్దర్ పార్థివదేహానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ఘన నివాళులు ఆర్పించారు. తెలంగాణ ఉద్యమానికి గద్దర్ పాటలు ప్రాణం పోశాయని ఆమె తెలిపారు. విప్లవకారుడైన గద్దర్ మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రజా ఉద్యమానికి ప్రాణం పోసిన గద్దర్ ఆట, పాటను మనం మిస్ అవుతున్నామని బండారు విజయలక్ష్మి పేర్కొన్నారు.
Read Also: Hyderabad News: మద్యం మత్తులో యువకుడి వీరంగం.. నడి రోడ్డుపైనే యువతిని వివస్త్రను చేసి..!
ఇక, గద్దర్ అల్వాల్‌లో స్థాపించిన మహా బోధి విద్యాలయంలోనే అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన పార్థీవదేహాన్ని బంధువులు, అభిమానులు, ఉద్యమకారులు కడసారి చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు. ఆయనతో తమ అనుబంధాన్ని వారు గుర్తుచేసుకుంటున్నారు. ఇవాళ ఉదయం 12 గంటల వరకూ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియం నుంచి గన్ పార్క్, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం మీదుగా అల్వాల్‌లోని ఆయన ఇంటికి తీసుకెళ్తారు.
Read Also: DCP Sandeep Rao: గద్దర్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నాం..
అల్వాల్ లోని గద్దర్ నివాసం నుంచి అంతిమయాత్ర కొనసాగనుంది. అయితే, మూడు రోజుల కిందట అపోలో ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకున్న గద్దర్.. ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటూ.. ఎన్నో పోరాటాలకు తన పాటలతోనే గద్దర్ ఊపిరి పోశారు.