Chandrahass:’గుంజీ గుంజీ’ పాటపై విమర్శలకు చంద్రహాస్ రిప్లై.. ‘బరాబర్ సారీ చెప్పా’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrahass:’బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు చంద్రహాస్ పాడిన ‘గుంజీ గుంజీ’ పాటపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ రేపుతుంది. సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి కూడా ఈ పాటను విమర్శించడంతో దీనిపై మరిన్ని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ చిత్రానికి ఈ రగడ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. అసలు ఏం జరిగిందంటే.. ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ‘గుంజీ గుంజీ’ అనే పాటను పాడుతూ అక్కడున్న ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అయితే ఈ పాటలోని కొన్ని లిరిక్స్ వల్ల ఈ వివాదం మొదలైంది. ఆ పాట పడుతున్న సమయంలో స్టేజ్‌పై ఉన్న జేడీ చక్రవర్తి షాక్ అయ్యారు. తాజాగా ఈ పాటపై జేడీ చక్రవర్తి వివరణ ఇస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు.
READ ALSO: Mega158 Cast: చిరంజీవి 158కు ‘మెగా’ క్యాస్టింగ్.. ఫుల్ లిస్ట్ ఇదేనా?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ క్రమంలో పాటపై వస్తున్న విమర్శలకు ‘బరాబర్ ప్రేమిస్తా’ హీరో చంద్రహాస్ కూడా ఘాటుగా స్పందించాడు. ఆయన రిలీజ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. “ఈ పాట 3.5 నిమిషాలది. కానీ విమర్శకులు కేవలం 5 సెకన్లు క్లిప్ చేసి అసభ్యమంటున్నారు. తెలుగు సినిమాల్లో బీప్ సౌండ్‌లు సర్వసాధారణం. నేను ఏమీ తప్పు చేయలేదు, అందుకు క్షమాపణలు చెప్పను” అని ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చంద్రహాస్ తన పెర్ఫార్మెన్స్‌పై రిగ్రెట్ లేదంటూ స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్‌గా మారింది. కొందరు చంద్రహాస్‌ను సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు ఈ పాటపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా ఈ రగడ ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాకు మంచి పబ్లిసిటీ ఇచ్చినట్లు అయ్యిందని అంటున్నారు. మరి ఈ ‘గుంజీ గుంజీ’ పాట వివాదం ఎలా ముగుస్తుందో వేచి చూడాల్సిందే!
READ ALSO: Eesha Rebba: పోలీసు స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ ఈషారెబ్బ.. ఆ వ్యక్తి వేధింపులే కారణమా?
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..