రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కార్యక్రమాన్ని సాహసోపేతంగా నిర్వహిస్తోంది.. కేంద్రం సుముఖంగా లేకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కార్యక్రమాన్ని సాహసోపేతంగా నిర్వహిస్తోందని బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందితో కలిసి కులగనన జరుగుతున్న తీరును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విమర్శల జల్లు కురిపించారు. ఏపీలో కులాల స్థితిగతులపై చంద్రబాబుకు ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. ఈ…
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ ఝాన్సీ మీద పోలీసుల దుశ్చర్య అమానుషమన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మీ. ఇవాళ ఝాన్సీని బండారు విజయలక్ష్మీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరంకుశంగా జుట్టు పట్టి లాగడం అమానవీయం. ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సి పై పోలీసుల దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కనికరం, దయ లేకుండా పోలీస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ను చూపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్…
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రతీ ఏడాది దసరా మహోత్సవం అనంతరం బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఆయన కుమార్తె విజయలక్ష్మి ఘనంగా నిర్వహించారు.
ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. గద్దర్ అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. అయితే, ఎల్బీ స్టేడియంలో ఉంచిన గద్దర్ పార్థివదేహానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ఘన నివాళులు ఆర్పించారు. తెలంగాణ ఉద్యమానికి గద్దర్ పాటలు ప్రాణం పోశాయని ఆమె తెలిపారు.