Balka Suman : దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలే స్వయంగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటు వేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక మర్చిపోయారన్నారు బాల్క సుమన్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టిన ప్రజలు స్వాగతిస్తున్నారని, ప్రజాదరణ పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద 48 గంటలు ఈసీ నిషేధించడం బిజెపి పార్టీ కుట్రలో భాగం మాత్రమేనన్నారు. రైతు రుణమాఫీ, మహాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, లాంటి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో తెలంగాణ ప్రజానీకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు బాల్క సుమన్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ సూచించిన బలహీనమైన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో నిలిపిందన్నారు. ఆర్.ఆర్ టాక్సీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానీకాన్ని దోపిడీకి గురి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Ajith Fan Arrested: విజయ్ సినిమా బ్యానర్ చింపిన అజిత్ ఫ్యాన్ అరెస్ట్
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
అంతేకాకుండా..’సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బిజెపి పార్టీ దేశ యువతను మోసం చేసింది. బీజేపీ ప్రభుత్వం దేశంలో కులాలు, మతాల ప్రాతిపదికన ప్రజలను విభజించి పాలిస్తున్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల ఎజెండాలో మతం, రిజర్వేషన్ల మీద ఓట్లను సెట్ చేసుకునే స్థాయికి దిగజారాయి. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారడం తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో ఏలాంటి అవకతవకలు జరగకుండా పేద ప్రజలకు ఇసుకను అందించాo. కేవలం డబ్బుల కోసమే బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన ఇసుక పాలసీని రద్దుచేసి కొత్త జీవోలు తీసుకువచ్చి ఇసుక దోపిడీకి పాల్పడేందుకు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మే 4 తారీకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కెసిఆర్ రోడ్ షోలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు..’ అని బాల్క సుమన్ అన్నారు.
Brij Bhushan: లైంగిక ఆరోపణల్లో ఇరుక్కున్న బ్రిజ్ భూషన్‌కి బీజేపీ షాక్.. కొడుకుకి టికెట్..
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!