Ajith Fan Arrested: విజయ్ సినిమా బ్యానర్ చింపిన అజిత్ ఫ్యాన్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajith Fan Arrested for Tearing Vijay Gilli Flexy: 2001లో ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో అజిత్ కుమార్, లైలా, సురేష్ గోపి నటించిన చిత్రం ‘దీనా’. యువన్‌శంకర్‌రాజా సంగీతం సమకూర్చారు. ఈ సినిమా తర్వాతనే అజిత్ ‘తల’ అనే టైటిల్‌తో పాపులర్ అయ్యాడు. ఈ సందర్భంలో, 23 సంవత్సరాల తర్వాత ‘దీనా’ చిత్రాన్ని అజిత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా నిన్న (మే 1) డిజిటల్ ‘రీ-రిలీజ్’ చేశారు. ఈ సందర్భంలో చెన్నైలోని ఓ థియేటర్‌లో ‘దీనా’ సినిమాని రిలీజ్ చేశారు. దీంతో అభిమానులు కేక్ కట్ చేసి పటాకులు పేల్చి ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. దానికి తోడు ఏకంగా కొందరు థియేటర్లోనే పటాకులు పేల్చారు. దీంతో థియేటర్‌ను పటాకుల మంటలు, పొగలు చుట్టుముట్టాయి. దీంతో కాసేపు తోపులాట కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అదేవిధంగా చెన్నైలోని కాశీ థియేటర్‌లో దీనా రీ-రిలీజ్ సందర్భంగా అజిత్ అభిమానులు భారీ బ్యానర్‌తో సంబరాలు జరుపుకున్నారు.
Music Director: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. 28 ఏళ్ళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి..
Also Read
- Sukumar - DSP: దేవిశ్రీ ప్రసాద్ - సుకుమార్‌ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
- Rashmika Mandanna: గాయాలపై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. అసలు ఏం జరిగిందో చెప్పిన స్టార్ హీరోయిన్!
- Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
- Sujatha Vijayakumar: రవి మోహన్ విడాకుల కేసులో ఆర్తి తల్లి బిగ్ బ్లాస్ట్.. ఇన్నాళ్లూ బయటకు రాని విషయాలు ఇవేనంట!
అదే థియేటర్‌లో ఉంచిన గిల్లి రీ రిలీజ్ బ్యానర్‌ను అజిత్ అభిమాని చించివేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ కేసులో గిల్లి బ్యానర్‌ను చింపివేసినందుకు అజిత్ అభిమాని ఎబినేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం, అసభ్యకరంగా మాట్లాడటం సహా 2 సెక్షన్ల కింద ఎంజీఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారని చెబుతున్నారు. ఇక ఈ సందర్భంలో థియేటర్‌లోని బ్యానర్‌ను చింపివేసిన వ్యక్తి క్షమాపణలు చెబుతున్న వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో ఎబినేష్ మాట్లాడుతూ.. కాశీ సినిమాస్ లో దీనా సినిమా చూడ్డానికి వెళ్ళాను. ఫ్రెండ్స్‌తో ఉన్న ఉత్సాహంతో నేను గిల్లి బ్యానర్‌ని చించివేశాను. అందుకు నేను విజయ్ అన్న, తమిళనాడు వెట్రి కజగం మిత్రులకు క్షమాపణలు చెబుతున్నాను. నేను ఇలాంటి సంఘటనలకు పాల్పడనని చెబుతూ క్షమాపణలు కోరుతున్నా అనిచెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!