బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తారని నేను కూడా ఊహించలేదు.. నా హయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం జరగటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ కు ఆర్టీసీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు.
తెలంగాణ ఆర్టీసీలో ఆ బంగళా పేరు చెబితే హడలిపోతున్నారా? గతంలో ఎంతోమంది సకుటుంబ సపరివారంగా ఆ భవనంలో ఉన్నారు. ఇప్పుడా బంగళా మాకొద్దు అంటే మాకొద్దని ముఖం చాటేస్తున్నారట. ఆర్టీసీలో రాజుగారి గదిలా మారిన ఆ బంగళా ఏంటి? ఎక్కడుంది? ఆర్టీసీ బంగ్లాపై రకరకాల చర్చలు..! తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పలు కార్పొరేషన్ చైర్మన్లకు, సలహాదారులకు ప్రభుత్వం క్వార్టర్స్‌ను కేటాయించింది. ఇటీవల కొన్ని కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్లగా వచ్చిన వారికీ నివాస భవనాలు ఇచ్చారు. వారిలో…