రెబా మోనికా జాన్.. ఈ భామ గురించి పరిచయం అవసరం లేదు..ఆమె తెలుగు లో రీసెంట్ గా విడుదలయి భారీ విజయం సాధించిన ”సామజవరగమన’ సినిమా లో హీరోయిన్ గా నటించి ఎంతో పాపులర్ అయింది. ఈ భామ తమిళం మరియు మలయాళం లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.అయితే, ఈ భామకు ముందుగా తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. నాని హీరోగా నటించిన ‘జెర్సీ’సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఈ భామకు వచ్చింది.. అయితే, రెబాకు డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో ఆమె ఆ సినిమా ను ఒప్పుకోలేదు. దాంతో ఈ సినిమా లో శ్రద్ధా శ్రీకాంత్ హీరోయిన్ గా నటించింది. రెబా మోనికా కు తెలుగులో మరో అవకాశం కూడా వచ్చింది.అదే పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రో’ సినిమా.
ఈ సినిమా లో ఈ భామకు సాయి ధరమ్ తేజ్ చెల్లెలుగా నటించే అవకాశం వచ్చింది..ఆ పాత్ర కోసం ముందు గా రెబా ను ఇంటర్వ్యూ కు పిలిచారట. అయితే, ఆ క్యారెక్టర్ కు రెబా సూట్ కాకపోవడం తో ఆమెను ఆ సినిమా కు తీసుకోలేదు.. ఈ రెండు అవకాశాలు మిస్ అవ్వడంతో రెబాకు తెలుగు సినిమాల్లో నటించే అవకాశం ఇంకా రాదని భావించినట్లు సమాచారం.. అయితే, ఆమె ఒక రోజు తన స్నేహితురాలి తో కలిసి ఓ సినిమా షూటింగ్ కు వెళ్లిందట.. అక్కడ శ్రీ విష్ణు హీరో గా నటించిన ‘సామజవరగమన’ సినిమా షూటింగ్ జరుగుతుంది.ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం నటిని వెతుకుతున్నారు. రెబాను షూటింగ్ లో చూసి డైరెక్టర్ ఎంతగానో ఫిదా ఆయ్యాడట.వెంటనే ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది.దీనితో సామజవరగమనా సినిమాతో ఈ భామ మంచి విజయం అందుకుంది. ఆమెకు ఇప్పుడు తెలుగు లో వరుస అవకాశాలు వస్తున్నాయి