Jupally Krishna Rao: నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా, రేషన్ కార్డులపై ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లక్ష్యాన్ని నీరు కార్చొద్దు అన్నారు. అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలి అని ఆయన తెలిపారు. ఇక, రైతు భరోసాపై దుష్ప్రచారం చేశారు, గతంలో ఉన్న ఏ పథకాలు ఎత్తి వేయడం లేదు.. కొత్త పథకాలు అమలు చేస్తున్నామని జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
Read Also: Israel : పదేళ్ల తర్వాత తన సైనికుడి డెడ్ బాడీ కనుగొన్న ఇజ్రాయెల్
ఇక, లబ్దిదారుల ఎంపిక జాగ్రత్తగా చేయాలి.. తప్పులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన మంత్రి జూపల్లి తెలిపారు. సాగు యోగ్యం ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తాం.. అర్హులైన వారికి ఆత్మీయ భరోసా రెండు విడతల్లో ఇస్తాం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేశా.. నా నియోజకవర్గంలో కూడా 1400 ఇళ్లు మంజూరు చేశారు.. ఇళ్ళ నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు.. రాష్ట్రంలో పరిమితంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించింది అని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.