Liver Disease : మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ లివర్ పని అయిపోయినట్లే?
- మన శరీరంలో లివర్ పాత్ర కూడా కీలకం
- ఈ లక్షణాలు లివర్ సమస్యలకు సంకేతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలతో పాటు లివర్ కూడా చాలా ముఖ్యమైన అంగం. లివర్ పనితీరులో ఏమాత్రం తేడా జరిగినా అది కాస్తా ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే లివర్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే.. మీ లివర్ ప్రమాదంలో ఉందని కొన్ని లక్షణాలు హెచ్చరిస్తాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం…
మూత్రం రంగులో మార్పు..
మూత్రం రంగులో మార్పు వచ్చినా.. కిడ్నీ, లివర్‌లో సమస్యలున్నట్లు భావించాలి. ముఖ్యంగా శరీరంలోని మలినాలను తొలగించే కాలేయం సరిగా పనిచేయకపోతే పిత్త రసం, లవణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరంలో పేరుకుపోయి, చివరికి మూత్రవిసర్జన, మలవిసర్జన సమయంలో బయటకు వస్తాయి. మీ నీళ్లు సరిగ్గా తాగకపోయినా మూత్రం ముదురు రంగులో ఉంటుంది. ఒకవేళ మీరు సరిపడా నీళ్లు తాగినా.. మీ మూత్రం ముదుర రంగులో ఉంటే లివర్ సమస్యలో ఉన్నట్లు అనుమానించాల్సిందే.
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
నోట్లో దుర్వాసన..
నోటి పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వల్ల నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక్కోసారి కాలేయంలో సమస్యలు వచ్చినా నోటి నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. మీరు నోటి శుభ్రత పాటించినా.. దుర్వాసన సమస్య ఉంటే డాక్టర్‌ను కలవడం మంచిది.
కళ్లు పసుపు రంగులోకి మారడం..
కొన్ని వ్యాధుల లక్షణాలు కళ్ల ద్వారానే గుర్తిస్తారు! దీనికి మంచి ఉదాహరణ కామెర్లు, హెపటైటిస్. ఈ సమస్యలు ఉంటే.. కళ్లు పసుపు పచ్చగా మారతాయి. ఒకవేళ.. మీరు నిద్ర లేవగానే కళ్ల రంగు పసుపు రంగులోకి మారితే.. లివర్ ప్రాబ్లమ్ ఉన్నట్లు అనుమానించాల్సిందే. మీరు వెంటనే డాక్టర్‌ను కలవడం మేలు.
కడుపు నొప్పి…
సాధారణంగా, కడుపులో అసౌకర్యం ఉంటే వికారంగా, వాంతి వచ్చేలా ఉంటుంది. కొన్ని సార్లు వాంతులు కూడా అవుతూ ఉంటాయి. చాలా మంది ఇది కడుపులో అసౌకర్యంగా భావించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ, ఈ సమస్య పదేపదే ఇబ్బంది పెడుతుంటే.. మీ లివర్‌లో సమస్య ఉందని అనుమానించాల్సిందే. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. అలాగే హఠాత్తుగా చేతులు, కాళ్లు వాపు వస్తే కూడావ లివర్ సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించాలి. ఈ సమస్యలు మీకు తలెత్తితే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!