Bhairavam : తమిళ్ లో సూరి నటించిన హిట్ సినిమా గరుడన్. ఈ సినిమాను తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నారు. మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ సమర్పణలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలోని ముగ్గురు హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి గుర్తింపు లభించింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను వాస్తవానికి సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ రానున్న పండుగకు మూడు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానుండడంతో వాటి మధ్యలో ఎందుకులే అని పోస్ట్ పోన్ చేసుకున్నారు. తాజగా అందుతున్న సమాచారం మేరకు భైరవం సినిమాను వచ్చే ఫిబ్రవరి 1న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పోటీలో మరే సినిమా లేకపోవడంతో ఆ డేట్ ను ఆలోచిస్తున్నారట మేకర్స్.
Read Also:Rohit Sharma: రోహిత్ శర్మపై వేటు.. మూడు వికెట్స్ కోల్పోయిన భారత్!
ఈ మల్టీస్టారర్ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ‘ఓ వెన్నెల’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌ను జనవరి 3న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, ఈ పాటను న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నారు. ఇక ఈ పాటను బెల్లంకొండ శ్రీనివాస్, అదితి శంకర్‌లపై చిత్రీకరించారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల బాణీలను అందిస్తున్నారు.