కమల్ హాసన్ కుమార్తె, నటి శ్రుతి హాసన్ ఇప్పటికే తన జీవితంలోని అనేక దశల గురించి బయట పెట్టింది. తల్లిదండ్రులు విడిపోవడం వల్లే తాను డిప్రెషన్‌లో ఉన్నానని, మద్యానికి బానిసై డిప్రెషన్‌లోకి వెళ్లి పిచ్చిదాన్ని అయ్యాయనని ఆమె వెల్లడించింది. అంతేకాదు ఇప్పుడు ఆమె దొంగతనంగా గుడికి ఎలా వెళ్ళాలి? అసలు ఎందుకు దొంగతనంగా గుడికి వెళ్ళాలి? అనే విషయాలు షేర్ చేసుకుంది. పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, నటి మాట్లాడుతూ, ‘నాకు దేవుడిపై చాలా నమ్మకం ఉంది. కానీ మా నాన్న కారణంగా గుడికి వెళ్లలేకపోయా, ఆయన నన్నే కాదు ఇంట్లో ఎవరినీ గుడికి వెళ్లనిచ్చే వాడు కాదని అన్నారు. నేను తరచూ చర్చికి వెళ్లేదాన్ని, అయితే ఈ విషయం నాన్నకు చాలా కాలంగా తెలియదు.
తాతయ్యతో కలిసి వెళ్లినా ఆ విషయం నాన్నకు చెప్పలేకపోయాను.’ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే, ఈ స్థాయిలో ధైర్యంగా ఉన్నానంటే దానికి కారణం దేవుడిపై నాకున్న నమ్మకమే. కానీ నాన్నకి అది నచ్చలేదని ఆమె అన్నారు. శృతి హాసన్ తల్లిదండ్రులు విడిపోయే నాటికి ఆమెకు 18 సంవత్సరాలు. బాల్యం నుండి యవ్వనంలోకి మారుతున్న సమయంలో నా తల్లిదండ్రుల విడిపోవడంతో నేను కుంచించుకుపోయాను. ఈ సంఘటనల వల్ల నేను మద్యానికి బానిసయ్యాను. తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, పిచ్చిదాన్ని అయ్యానని ఆమె తెలిపింది. అప్పుడు నా మానసిక ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వ్యాపించాయి. అది నిజమైంది. అయితే దీనికి కారణం చాలా మందికి తెలియదు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రుల విడాకులు. ఇది నా మనసుకు చాలా బాధ కలిగించిందని శృతి తెలిపింది.