Digital Arrest Call: ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ కేసులు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ తరహా కేసులు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ముంబైలో కూడా ఒక ఇలాంటి విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో, యువకుడి చాకచక్యంతో మోసగాడు స్వయంగా ఫోన్‌ను డిస్‌కనెక్ట్ చేయవలసి వచ్చింది. అసలు సంగతి ఏంటన్న విషయానికి వస్తే.. ముంబైలోని అంధేరీ ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి మోసగాడు బాధితుడిని భయపెడతాడు. ఈ వీడియో ప్రారంభంలో, మోసగాడు ఒక వ్యక్తిగా అంధేరీ ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పాడు. అయితే, ఫోన్‌కి సమాధానం ఇచ్చే వ్యక్తి ముఖం చూపించకుండా.. తన చిన్న కుక్కపిల్లను మొబైల్ కెమెరా ముందు ఉంచాడు.
Also Read: Manmohan Singh Cremation: పీవీకి మీరు చేసింది ఏమిటి..? కాంగ్రెస్‌వి చిల్లర రాజకీయాలు..
సైబర్ నేరస్తుడికి ఝలక్ ఇచ్చిన యువకుడు.. #DigitalArrest #ScamAlert #cybercrime #ScammerCaught #SocialMediaViral #PoliceScam#viralvideoシ #Viralnews pic.twitter.com/P8aNDI5SsB
— Kirak News (@Kiraknews9) December 29, 2024
ఈ క్రమంలో, బాధితుడు తన చాకచక్యాన్ని ప్రదర్శించి, “ఇది తీసుకో సార్… నేను కెమెరా ముందుకు వచ్చాను” అని చెప్పాడు. ఆ తర్వాత, అతను ఆ కుక్కపిల్లను మరింత కెమెరా దగ్గర తీసుకెళ్లి, “హే, ఇది నేనే.. హే, పోలీసు అధికారి. అది కనబడుతుందా?” అని ప్రశ్నించాడు. అతను “హే, నకిలీ యూనిఫాం” అని నవ్వుతూ చెప్పాడు. ఇది చూసిన మోసగాడు ఆశ్చర్యపోయి, తన ముఖాన్ని కెమెరా నుండి తిప్పుకున్నాడు. ఈ సంఘటన తరువాత, మోసగాడు విషయాన్నీ గమనించి ఫోన్ డిస్‌కనెక్ట్ చేస్తాడు. ఆ సమయంలో పక్కన మరో వ్యక్తి పూర్తి సన్నివేశాన్ని మొబైల్ వీడియో తీశారు. ఆ వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ రకమైన కేసులు అధికారులకు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ తరహా మోసాలకు వ్యతిరేకంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పోలీసు అధికారులు కూడా నిఘా పెంచాలి.