Today Chandrababu Naidu Wedding Day: నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల పెళ్లిరోజు. చంద్రబాబు, భువనేశ్వరిల వివాహం 1981 సెప్టెంబర్ 10న చెన్నైలో జరిగింది. అయితే ఈ ప్రత్యేక రోజు (పెళ్లిరోజు)కు ఒక్క రోజు ముందు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం గమనార్హం. పెళ్లిరోజున కేసులు, కోర్టు అంటూ మాజీ సీఎం తిరుగుతున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకి సంబందించి ఏసీబీ కోర్టులో చంద్రబాబు స్వయంగా వాదనలు వినిపించారు. వాదనలకు అవకాశమివ్వాలని చంద్రబాబు కోరగా.. న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తన అరెస్ట్ అక్రమమని.. రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని చెప్పారు. ‘స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు కేబినెట్ నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు 2015-16 బడ్జెట్‌లో పొందుపర్చాం. దాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరు. 2021 నాటి ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేదు అని చంద్రబాబు అన్నారు.