Dan Christian: సాధారణంగా క్రికెట్‌లో గాయపడిన ఆటగాడి స్థానంలో రిజర్వ్ క్రికెటర్ లేదా సబ్‌స్టిట్యూట్ ఆటగాడు బరిలోకి దిగడం సాధారణం. కానీ, బిగ్ బాష్ లీగ్ (BBL)లో ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. సిడ్నీ థండర్స్ టీమ్ అసిస్టెంట్ కోచ్ డాన్ క్రిస్టియన్ తుది జట్టులోకి చేరి బ్యాటింగ్ చేసిన సంఘటన అభిమానులను ఆశ్చర్యపరిచింది. సిడ్నీ థండర్స్ టీమ్‌కి అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న డాన్ క్రిస్టియన్ సోమవారం బ్రిస్బేన్ హీట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. జట్టులోని ఆటగాళ్లు బాన్‌క్రాఫ్ట్, డానియెల్ సామ్స్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడడంతో, రిజర్వ్ ప్లేయర్లు కూడా ఫిట్నెస్ సమస్యల కారణంగా అందుబాటులో లేకపోవడంతో జట్టు అతడిని తుది జట్టులో చేర్చింది.
Also Read: Tractor March: దేశవ్యాప్తంగా జనవరి 26న ట్రాక్టర్ మార్చ్‌కి రైతుల పిలుపు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సిడ్నీ థండర్స్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేయగలిగింది. ఇందులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ 36 బంతుల్లో 50 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవగా.. అతని తర్వాత అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు డాన్ క్రిస్టియన్. అతను 17వ ఓవర్లో క్రీజులోకి వచ్చి 15 బంతుల్లో 153 స్ట్రైక్ రేట్‌తో రెండు సిక్సర్ల సహాయంతో 23 పరుగులు సాధించాడు. అంతేకాదండోయ్.. వియర్ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో కొట్టిన 92 మీటర్ల సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. బ్యాటింగ్ చేసిన క్రిస్టియన్, ఆ తర్వాత బౌలింగ్‌లోనూ 4 ఓవర్లు వేసి 25 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీశాడు.
Also Read: Chahal-Dhanashree: ధనశ్రీతో విడాకుల వార్తలపై తొలిసారి స్పందించిన చాహల్..
Dan Christian!
The 41-year-old has just smashed this Xavier Bartlett delivery 92 metres! #BBL14 pic.twitter.com/ZgbVIt9yeC
— KFC Big Bash League (@BBL) January 6, 2025
అయితే, అతని పోరాటం సిడ్నీ థండర్స్‌ను ఓటమి నుండి కాపాడలేకపోయింది. బ్రిస్బేన్ హీట్ జట్టు బ్యాటర్స్ బ్రయంట్ 72 పరుగులు, రెన్‌షా 48 పరుగులు చేయడంతో 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఇకపోతే, 2023లో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన డాన్ క్రిస్టియన్ ఆస్ట్రేలియా తరఫున 43 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్ నుంచి రిటైర్డ్ తర్వాత ఇలా కోచ్ అవతారం ఎత్తాడు సిడ్నీ థండర్స్ కోచ్ పాత్రలో మాత్రమే కాకుండా ఆటగాడిగా కూడా ఈ లీగ్‌లో కొత్త చరిత్రను సృష్టించిన డాన్ క్రిస్టియన్ గురించి అభిమానులు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.