ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్యం కుంభకోణం సంబంధించి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనని తీహార్ జైల్ కు రిమాండ్ కు తరలించింది. తాజాగా జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ కి ఢిల్లీ గవర్నర్ తాజాగా ఓపెన్ లెటర్ రాశారు. ఢిల్లీ గవర్నర్ బి కే సక్సేనా ఢిల్లీ నగరంలో తాగునీటి సమస్యపై ఓపెన్ లెటర్ విడుదల చేశారు.
Also Read: Rakul Preet Singh: హైదరాబాదులో రకుల్ కొత్త ‘ఆరంభం’..
ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై గవర్నర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ నగరంలో నీటి కొరత సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని గత పది సంవత్సరాలుగా నగరంలో మంచినీటి సమస్య తీర్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నగరంలో తాగునీటి సమస్య ఇప్పటికీ కాదని.. ప్రతి ఏటా ఈ సమస్య వస్తుందని.. కానీ ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు తీసుకోవడంతో ఢిల్లీ ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు ఆయన తెలిపారు.
Also Read: Snake In Train: బుల్లెట్ రైలులో ప్రత్యక్షమైన పాము.. 17 నిమిషాలు జర్నీ ఆలస్యం..
ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ నగరంలో మంచి నీటి సమస్యపై సంబంధించి 2017 నుండి ఓ వీడియోలో వచ్చిన అనేక క్లిప్పింగ్స్ ను జతచేస్తూ ఆయన లేఖను విడుదల చేశారు. ఢిల్లీ నగరంలో నీటి సమస్య తీవ్రత ఎలా ఉందో ఆయన వివరంగా తెలిపారు. ఇక ఢిల్లీలో నీటి నిర్వహణ విషయం సంబంధించి ఢిల్లీ కంటే చెన్నై, ముంబై, పూణే నగరాలు ఎంతో బెటర్ గా ఉన్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బీహార్ జైలు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ లేఖ పైన ఎలాంటి సమాధానం ఇస్తారో వేసి చూడాల్సిందే.

13