Group 1 Mains Result Release: ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షా ఫలితాలను ప్రకటించింది.. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ ఈ రోజు గ్రూప్ ఫలితాలను విడుదల చేశారు.. గ్రూప్-1లో ఖాళీల 110 పోస్టులకుగానూ తుది ఫలితాలు వెల్లడించారు.. గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు పూర్తిస్థాయిలో పారదర్శకత పాటించినట్టు ఈ సందర్భంగా గౌతం సవాంగ్ పేర్కొన్నారు.. మొత్తంగా గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య 111 ఉండగా.. ఒక పోస్ట్ స్పోర్ట్స్ కోటాలో…
ఇటీవల ఏపీ ప్రభుత్వం డీజీపీగా ఉన్న సవాంగ్‌ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు ఏపీకి నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా పై నమ్మకం ఉంచి డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలని ఆయన వెల్లడించారు. నాపై ఉన్న నమ్మకాన్ని మరింత నిలబెట్టుకునే విధంగా పని చేస్తానన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఆకాంక్షలు ఉంటాయని, ఏదైనా మారుమూల ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ తప్పు చేసినా…