Bus Catches Fire: కొన్ని కొన్ని సార్లు అంతా సవ్యంగా ఉంది అనుకున్నా కూడా అనుకొని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి ఒక ఘటనే అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగింది. ఒక హైవే పై అప్పటి వరకు మంచిగా వెళ్తున్న బస్సులో సడెగా మంటలు వ్యాపించాయి. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసి నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు.డ్రైవర్ అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది.
వీడియో ప్రకారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ నగరంలో హైవే పై ఒక పెద్ద డబుల్ డక్కర్ బస్సు వెళుతుంది. ఆ రోడ్డుపై చాలా వాహనాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతం చాలా రద్దీగా ఉన్నట్లు మనకు వీడియోలో కనిపిస్తోంది. అలా ఆ బస్సు కొద్ది దూరం ప్రయాణించాక దాని వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు ఆపేశాడు. దానిలో ఉన్నవారందరూ భయంతో బస్సు దిగి పరుగులు తీశారు. తరువాత బస్సు పూర్తిగా కాలిపోయింది. దీని నుంచి పొగ, మంటలు చెలరేగి చుట్టుపక్కల వ్యాపించాయి. అయితే బస్సులో ఉన్నవారందరూ ప్రాణాలతో బయటపడ్డారు.
Also Read:Vespa: ‘వెస్పా’ కొత్త మోడల్… ధర వింటే దిమ్మ తిరగాల్సిందే
అంతేకాకుండా ఘటన జరగుతున్న సమయంలో బస్సు పక్క నుంచి వెళుతున్న కార్లు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా తప్పించుకున్నాయి. కొద్దిసేపటికి ఫైరింజన్ లు వచ్చి మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటన మొత్తం హైవేపై ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను అర్జెంటీనా పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఇది చూసిన వారందరూ ఆ బస్సులో ఉన్న వారందరూ ఎంతో అదృష్టవంతులు అందుకే వారికి ఏం కాలేదని దేవుడుకు థ్యాంక్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక డ్రైవర్ చాకచక్యాన్ని కూడా చాలా మంది మెచ్చుకుంటున్నారు. అతను సమయానికి బస్సు ఆపడంతో చాలా మంది ప్రాణాలు పోకుండా కాపాడాడని కొనియాడుతున్నారు.
Watch a bus catch on fire in Argentina #bus #busfire #argentina pic.twitter.com/qxLlALdHFp
— UpToDate (@UpToDateNewsSvc) August 16, 2023