Apple IOS 26: ఆపిల్ సంస్థ తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ iOS 26ను లాంచ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) లో ఈ కొత్త అప్డేట్‌ను అధికారికంగా విడుదల చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇదే అతిపెద్ద విజువల్ మార్పు కావడం విశేషం. 2013లో iOS 7తో ఆపిల్ విడుదల చేసిన ఫ్లాట్ డిజైన్ ట్రెండ్‌కు ఇక ముగింపు పలికేలా కనిపిస్తోంది.
Read Also: Nicholas Pooran: ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన విండీస్ విధ్వంసక ప్లేయర్
iOS 26లో “లిక్విడ్ గ్లాస్” అనే కొత్త డిజైన్ ను పరిచయం చేసింది. ఈ డిజైన్ అనేది గాజు వంటి పారదర్శకత, లోతైన షేడింగ్, అలాగే మృదువైన అనుభూతిని కలిగించేలా ఉంటుంది. యూజర్ ఇంటర్‌ఫేస్‌లో ప్రతి మూలకానికి ఓ అద్భుత స్పందన ఉంటుందని కంపెనీ చెబుతోంది. యాప్‌లు, సిస్టమ్ సెట్టింగ్స్, మెనూలన్నీ ఈ డిజైన్‌లో చక్కగా పనిచేయనున్నాయి. ఈ డిజైన్ కేవలం చూడడానికి మాత్రమే పరిమితం కాదు.. వినియోగదారుల అనుభూతిని మెరుగుపరిచేందుకు, అలాగే భవిష్యత్ హార్డ్వేర్ కు అనుకూలంగా ఉండేందుకు దీన్ని రూపొందించారని ఆపిల్ సంస్థ పేర్కొంది. Apple Vision Proలో కనిపించే visionOS డిజైన్ శైలికి ఇది చాలా దగ్గరగా ఉంటుంది.
Read Also: UEFA Nations League 2025: పోర్చుగల్ జట్టును నేషన్స్ లీగ్ విజేతగా నిలిపిన క్రిస్టియనో రోనాల్డో..!
కొత్త ఫీచర్లు:
దాదాపు అన్ని అప్లికేషన్స్ లోనూ ఈసారి పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. అవేంటంటే..
Phone App: కాల్ స్క్రీనింగ్, హోల్డ్ అసిస్ట్ ఫీచర్లతో కొత్త లేఅవుట్.
Messages App: థీమ్/బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్, గ్రూప్ చాట్స్‌లో పోల్స్, టైపింగ్ ఇండికేటర్స్.
FaceTime and Phone: ఆపిల్ ఇంటలిజెన్స్ ఆధారిత లైవ్ ట్రాన్సలేషన్ ఫీచర్.
Camera App: సులభతరమైన UIతో కొత్త డిజైన్.
Photos App: మెరుగైన ట్యాబ్స్, బ్రౌజింగ్ అనుభవం.
Safari: ఎడ్జ్-టు-ఎడ్జ్ వ్యూవ్ తో మరింత ఇంటరాక్టివ్ వెబ్ బ్రౌజింగ్.
అలాగే Apple Games అనే ప్రత్యేకమైన కొత్త యాప్ ప్రవేశపెట్టడం కూడా విశేషం. ఆర్డర్ ట్రాకింగ్ సమాచారం ఇప్పుడు ఆపిల్ ఇంటలిజెన్స్ ద్వారా ఆటోమేటిక్ గా సమ్మరీ రూపంలో చూపించబడుతుంది. ఇకపోతే ఈ కొత్త వర్షన్ నేడు (జూన్ 10) కేవలం డెవలపర్ల కోసం మొదటి బీటా వెర్షన్ విడుదల చేయబడింది. జూలై నెలలో పబ్లిక్ బీటా లభ్యం కానుంది. చివరి పబ్లిక్ వెర్షన్‌ను iPhone 17 సిరీస్‌తో పాటు ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు. iOS 26ని iPhone 11, ఆ తరువాతి మోడళ్లలో పొందొచ్చు.