Nicholas Pooran: అంతర్జాతీయ క్రికెట్‌కు వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు నికోలస్ పూరన్ గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్టు పెట్టారు. ఈ నిర్ణయం చాలా కష్టమైనది.. అయినప్పటికీ చాలా ఆలోచించి ఈ డిసిషన్ తీసుకున్నాను అని అందులో పేర్కొన్నాడు. ఇక, ఈ 29 ఏళ్ల బ్యాటర్ 106 T20ల్లో 2,275 రన్స్ చేయగా.. 61 వన్డేల్లో 1,983 పరుగులు చేశారు. అందులో 3 శతకాలు కూడా ఉన్నాయి. అయితే, ఇటీవల ఐపీఎల్ 2025 సీజన్‌లో తన పవర్ ఏంటో అందరికి చూపించారు. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. లక్నో జట్టు తరపున 14 మ్యాచ్‌ల్లో దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో 524 పరుగులు సాధించాడు పూరన్.
Read Also: UEFA Nations League 2025: పోర్చుగల్ జట్టును నేషన్స్ లీగ్ విజేతగా నిలిపిన క్రిస్టియనో రోనాల్డో..!
కాగా, తన ఇంస్టాగ్రామ్ పోస్టులో ఇలా రాసుకొచ్చారు.. చాలా ఆలోచించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను.. మేము ఇష్టపడే ఈ ఆట నాకు చాలా ఇచ్చింది.. ఇస్తూనే ఉంటుంది.. ఎన్నో మరపురాని జ్ఞాపకాలు, వెస్టిండీస్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం నాకు కల్పించారు.. ఆ మెరూన్ రంగు జెర్సీ ధరించడం, దేశం కోసం నిలబడటం, నేను స్టేడియంలోకి అడుగు పెట్టిన ప్రతిసారీ నా శక్తి మేర ప్రయత్నించాను.. నిజంగా మాటల్లో చెప్పడం కష్టంగా ఉంది.. కెప్టెన్‌గా విండీస్ జట్టును నడిపించడం నేను ఎల్లప్పుడూ గౌరవంగానే భావిస్తాను అి నికోలస్ పూరన్ రాసుకొచ్చారు.
Nicholas Pooran retires from international cricket.
We warned people it was coming.
Never a dull day! pic.twitter.com/TiIndrFdt9
— Caribbean Cricket Podcast (@CaribCricket) June 9, 2025