ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. పోలీస్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు వెల్లడించారు. త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష చేపట్టారు.
ITBP Constable Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగం సాధించి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు శుభవార్త. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కింద వివిధ పోస్టుల భర్తీకి ఐటీబీపీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి అంటే ఆగస్టు 12, 2024 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు ప్రారంభమైన వెంటనే అభ్యర్థులు ITBP అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ లో…
ఏపీలో శని, ఆదివారాల్లో జరిగిన ఎస్సై మెయిన్స్ పరీక్షల ప్రిలిమినరీ 'కీ' విడుదలైంది. ఈ రెండు రోజుల్లో విశాఖ, గుంటూరు, ఏలూరు, కర్నూలు నగరాల్లో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలు ప్రశాంతంగా ముగియగా.. ఆదివారం సాయంత్రం ప్రాథమిక కీ విడుదలైంది.
ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది.. దీంతో, అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధం అవుతున్నారు. కోచింగ్ సెంటర్లు చుట్టూ పరుగులు పెడుతున్నారు.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోచింగ్‌లు.. సొంతంగా ప్రిపేర్ అయ్యేవాళ్లు కూడా లేకపోలేదు.. అయితే, తాము కూడా పరీక్షలు రాస్తాం.. మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ట్రాన్స్ జెండర్స్.. పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అప్లికేషన్‌లో పురుషులు, మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చారని.. మాకు కూడా ఓ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.…
పోలీస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన పదిరోజుల్లో 3,52,433 దరఖాస్తులు వచ్చాయి. పోలీస్, ఎక్సైజ్, రవాణాశాఖల్లోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,291 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి ఇటీవల మొత్తం ఆరు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. మే 2 నుంచి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలు కాగా తొలి పదిరోజుల్లో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నట్టు టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ…
తెలంగాణలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ యూసఫ్ గూడా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో సిటీ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. 3000 ఉద్యోగాలు కల్పించడానికి ముందుకు వచ్చాయి ప్రైవేట్ కంపెనీలు. ఈ జాబ్ మేళాకు పెద్ద ఎత్తున హాజరయ్యారు నిరుద్యోగులు. జాబ్ మేళాలు నిరుద్యోగులకూ ఎంతో ఉపయోగపడతాయన్నారు సీవీ ఆనంద్. కోవిడ్ వచ్చాక ఫిజికల్…
పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగుల కల త్వరలోనే సాకారం కానుంది. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. 19 వేల పైచిలుకు కానిస్టేబుల్ పోస్టులు.. 625 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. పోలీస్ శాఖలో ఖాళీలను గుర్తించి ఆర్థిక శాఖకు నివేదిక పంపించారు డీజీపీ. ఆర్థిక శాఖ ఆమోదం రాగానే పోలీసు నియామకాలకు…