ఆప్కాస్ వ్యవస్థపై పూర్తి యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామక వ్యవస్థపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. విద్యాశాఖ చాంబర్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, పురపాలక శాఖ మంత్రి నారాయణతో కూడిన మంత్రుల బృందం అధికారులతో మొదటిసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆప్కాస్ వ్యవస్థ గురించి సమగ్ర సమాచారాన్ని అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. Also Read:…
నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం కానుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సోమవారం రాజధాని అమరావతిలో భూముల కేటాయింపు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అయిన విషయం…
Minister Nrayana: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రి నారాయణ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ భేటీలో మొత్తం 16 అంశాలు చర్చకు వచ్చాయి. వీటిలో 12 అంశాలకు ఉపసంఘం ఆమోదం తెలిపింది. భూములు కేటాయించిన సంస్థల పనితీరు, నిర్మాణాల పురోగతిపై సమీక్ష జరిపారు. గైయిల్ ఇండియా లిమిటెడ్ (GAIL India Ltd), అంబికా దర్బార్ బత్తి సంస్థలకు అప్పట్లో కేటాయించిన భూములు సరైన స్పందన లేకపోవడంతో వాటిని రద్దు చేసినట్లు మంత్రి…
జగనన్న భూహక్కు-భూరక్ష పథకంపై ఏర్పాటు చేసిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ్ కల్లాం అధ్యక్షతన భేటీ అయింది. పథకం అమలుపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంత్రుల సబ్ కమిటీ సమీక్షించింది.