నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.. పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.. ఇక సినీ ప్రముఖులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అబ్బాయికి బర్త్ డే విషెస్ చెప్పాడు.. ఇప్పుడు అల్లు అర్జున్ రామ్ చరణ్ కు బర్త్ విషెష్ తెలుపుతూ సోషల్ మీడియాలో స్పెషల్ వీడియోను పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ వైరల్ అవుతుంది..
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏదో ఈవెంట్ లో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.. ఆ వీడియోను పోస్ట్ చేస్తూ హ్యాపీ బర్త్ డే మై మోస్ట్ స్పెషల్ కజిన్.. లవ్ యూ అంటూ రాసుకొచ్చాడు.. ఆ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా వచ్చిన గేమ్ చేంజర్ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.. గేమ్ చేంజర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే బుచ్చి బాబుతో, సుకుమార్ తో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే..
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 10 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీ తో దుబాయ్ ట్రిప్ కు వెళ్ళాడు.. అక్కడ అల్లు అర్జున్ మేడమ్ టుస్సాడ్ మ్యూజియం లో మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించునున్నారు..