ఆంధ్రప్రదేశ్ డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలైయ్యాయి. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 49,993 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా పరీక్షకు 42,928 మంది మాత్రమే విద్యార్ధుల హాజరయ్యారు. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ క్యాంపస్ లలో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ విధానంలో మొదటి దశ విద్యార్ధుల ఎంపిక మార్చి 22న ఉంటుందని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ కార్యదర్శి విషయాన్ని వెల్లడించారు.
2024-2025 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను తాడేపల్లి లోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ ప్రధాన కార్యాలయం నుండి విడుదల చేసారు అధికారులు. 10 మార్చి 2024న డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు ప్రవేశపరీక్షల్లో చూపిన ప్రతిభను ఆధారంగా ఆయా కేటగిరీలలో విద్యార్ధులకు అడ్మిషన్లు ఇవ్వబోతున్నారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వారి ఫలితాలను http.//apbragcet.apcfss.in వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.
Also read: Gold Price Today: మహిళలకు శుభవార్త.. స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు!
మెరిట్ లిస్ట్ ఆధారంగా 22 మార్చి 2024 న పరీక్షలకు హాజరైన విద్యార్ధుల మొదటి దశ విద్యార్ధుల ఎంపిక పూర్తిగా ఆన్ లైన్ విధానంలో ఉంటుందని, ఆపై మిగిలిన ఖాళీలను ఆధారంగా జోన్ ల వారీగా తర్వాత దశలో ఎంపికలు ఉంటాయని అధికారులు తెలిపారు.