ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కేటగిరీ కింద 89,788 మందిని అర్హులుగా గుర్తించారు. పింఛను తీసుకునే భర్త చనిపోతే తదుపరి నెల నుంచే భార్యకు పింఛను అందేలా చర్యలు చేపట్టారు. ఈ నెల 30లోగా వివరాలు సమర్పిస్తే, జూన్ 1 నుంచి పింఛను జారీ చేయనున్నారు.
READ MORE: Visakhapatnam:”చర్చికి తీసుకెళ్లి చంపేశారు?” విశాఖలో కలకలం రేపుతున్న విద్యార్థిని మృతి కేసు…
కాగా.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఆరేడు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు మంజూరు చేసే పద్ధతికి స్వస్తి పలికింది. ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే వెంటనే భార్యకు ఫించన్ మంజూరుకు నిర్ణయం తీసుకుంది. దీనిని స్పౌజ్ క్యాటగిరీగా గుర్తిస్తూ పెన్షన్ మంజూరు చేస్తుంది. సీఎం చంద్రబాబు గత ఏడాది నవంబరు 1న శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్బంగా స్పౌజ్ క్యాటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛను మంజూరు చేస్తామని ప్రకటించారు.
READ MORE: CM Chandrababu: మంత్రి పదవి అడిగితే.. నన్ను కిందికి పైకి చూశారు!