CM Chandrababu: 2014-19 మధ్య కాలంలో అన్న క్యాంటీన్లు పెట్టాం.. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు పెడితే.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని మరింత అభివృద్ధి చేసింది.. కానీ ఏపీలో దౌర్బాగ్యం.. అన్న క్యాంటీన్లను రద్దు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. తాజాగా అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించామని తెలిపారు. ఇప్పుడు 204 అన్న క్యాంటీన్లు ఉన్నాయి.. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 70…
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పర్యటనలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒకటో తారీకు వస్తే పండగ వాతావరణం నెలకొంటుందని.. వైసీపీ పాలనలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేందుకు ఐదేళ్లు పట్టిందన్నారు. జగన్ పింఛన్లు పెంచుతామని ప్రజలను మోసం దగా చేశారని.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి విషమంగా ఉన్న పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్నామని తెలిపారు. ఏడాది పాలనలో పెద్ద ఎత్తున అభివృద్ధి…
Annadata Sukhibhava: కడప మహానాడులో హామీ ఇచ్చా త్వరలోనే రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అనుకున్న ప్రకారం స్టీల్ ప్లాంట్ ప్రారంభించాం. 2028 డిసెంబర్ కల్లా ఫేస్ వన్ స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ప్రతి కుటుంబానికి విద్యా భద్రతకు భరోసా కల్పించేందుకు శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. ఈ సందర్బంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. లోకేష్ మాట్లాడుతూ.. తల్లికి వందనం ద్వారా 67,27,624 మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేశాం.. అర్హులు ఎంత మంది ఉన్నా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. సాంకేతిక సమస్యలతో నిధులు జమ…
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “విధ్వంసం నుండి వికాసానికి” అనే నినాదంతో తన ప్రభుత్వ కీలక కార్యక్రమాలపై విశ్లేషణ ఇచ్చారు. ముఖ్యంగా “తల్లికి వందనం” పథకాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఇది కేవలం ఒక పథకం కాదని, ప్రతి కుటుంబానికి విద్యా భద్రతకు భరోసా అంటూ వివరించారు. Read Also: YSRCP: “జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే…
చౌక ధరల దుకాణాలు మళ్ళీ తెరుచుకుంటున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జూన్ 1 నుంచి 29,760 చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులు అందించబోతున్నామని స్పష్టం చేశారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.
ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కేటగిరీ కింద 89,788 మందిని అర్హులుగా గుర్తించారు. పింఛను తీసుకునే భర్త చనిపోతే తదుపరి నెల నుంచే భార్యకు పింఛను అందేలా చర్యలు చేపట్టారు. ఈ నెల 30లోగా వివరాలు సమర్పిస్తే, జూన్ 1 నుంచి పింఛను జారీ చేయనున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షమ పథకాల విషయంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా? లేదా ఏదైనా అసంతృప్తి ఉందా? అనే కోణంపై దృష్టిసారించింది ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా.. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది ప్రభుత్వం.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు సోము వీర్రాజు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం లో ప్రజా పాలన సాగుతుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచి అమలు చేస్తున్నారన్నారు.