ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కేటగిరీ కింద 89,788 మందిని అర్హులుగా గుర్తించారు. పింఛను తీసుకునే భర్త చనిపోతే తదుపరి నెల నుంచే భార్యకు పింఛను అందేలా చర్యలు చేపట్టారు. ఈ నెల 30లోగా వివరాలు సమర్పిస్తే, జూన్ 1 నుంచి పింఛను జారీ చేయనున్నారు.
దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయాణంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టిసి) కింద కేంద్ర ఉద్యోగులు ఇప్పుడు తేజస్ ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ వంటి లగ్జరీ రైళ్లలోను ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ సౌకర్యం ద్వారా ఉద్యోగులు తాము అర్హత ఉన్న రైళ్లలో పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) విడుదల చేసిన తాజా…