ఏపీలో 81 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తేలింది. 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సులో నిరక్షరాస్యులు ఉన్నారు. విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేశ్ విస్మయం వ్యక్తం చేశారు. వయోజనా విద్యా మిషన్ తక్షణం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ‘అందరికీ విద్య (వయోజన విద్య)లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్‌లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్యక్రమానికి శ్రీకారం…
ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కేటగిరీ కింద 89,788 మందిని అర్హులుగా గుర్తించారు. పింఛను తీసుకునే భర్త చనిపోతే తదుపరి నెల నుంచే భార్యకు పింఛను అందేలా చర్యలు చేపట్టారు. ఈ నెల 30లోగా వివరాలు సమర్పిస్తే, జూన్ 1 నుంచి పింఛను జారీ చేయనున్నారు.