జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్.జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్పందన, జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం, నాడు – నేడుపై సీఎం సమీక్షించారు.
ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. రాష్టంలో ఆదాయాలు గాడినపడ్డాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.