ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్రంలో భెజ్జీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు హద్మా అలియాస్ సంకు మృతి చెందినట్లు సమాచారం.