Nellore: అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఇంకా గోవాలోనే ఉన్నారు. కుటుంబ సభ్యులతో చిల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. 18వ తేదీ కౌన్సిల్ సాధారణ సమావేశం ఉండటంతో నేరుగా కార్పొరేషన్‌కి రానున్నారు. మేయర్ రాజీనామాతో ఇన్‌ఛార్జి మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు.. ఎన్నికల కమిషనర్ తేదీ ఖరారు చేసిన తరువాత కార్పొరేటర్లు కొత్త మేయర్‌ను ఎన్నుకోనున్నారు.
నెల్లూరు సిటీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ వైసీపీ నేత రూప్ కుమార్ యాదవ్ మధ్య గత కొంతకాలంగా విభేదాల నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (సోమవారం) సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో అనిల్ కుమార్ యాదవ్ భేటీ సమావేశం అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు అనిల్ కుమార్ తో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుకున్నారు.
Anil Kumar Yadav vs Roop Kumar Yadav: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.. ఇదే సమయంలో.. పార్టీలో ఉన్న విభేదాలను తొలగించి.. అంతా కలిసి కట్టుగా పనిచేస్తూ ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.. ఇక, నెల్లూరు జిల్లా రాజకీయాలు ఏపీలో హాట్ టాపిక్‌గా మారిపోయిన విషయం విదితమే.. వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఏకంగా నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై…