ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ లాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ వాచ్ లను కూడా వాడుతున్నారు..అందుకే వాటికి డిమాండ్ కూడా బాగా పెరిగింది..దాదాపు ఫోన్ లో మాదిరిగానే అన్ని ఫీచర్స్ ఉండటంతో ఎక్కువ మంది స్మార్ట్ వాచ్ లను వాడుతున్నారు..అయితే ఆ ఫీచర్లు చాలా మంది సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ఏదో స్టైల్ కోసం, లేదా మెసేజ్ లు, లేదా నడుస్తున్నప్పుడు అడుగులు లెక్కించడానికి మాత్రమే ఎక్కువగా వాటిని వాడుతున్నారు. కానీ ఈ స్మార్ట్ వాచ్ బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు..అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రాండెడ్ వాచ్ లలోనే కాకుండా అన్ని రకాల వాచ్ లలో హెల్త్ కు సంబందించిన ఫీచర్స్ కూడా ఉంటాయి..ఈ వాచ్ లను ఉపయోగించి వెయిట్ లాస్ అవడానికి మీరు పాటించవలసిన పద్ధతులను ఇప్పుడు చూద్దాం..
ప్రతి కంపెనీ స్మార్ట్ వాచ్ లో హార్ట్ రేట్ మోనిటర్ ఉంటుంది. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఇది మీకు బాగా ఉపకరిస్తుంది. మొదటిగా మీరు రెస్ట్ లో ఉన్నప్పుడు హార్ట్ రేట్ ను చూసుకోవాలి. ఆ సమయంలో రక్తం శరీరం అంతా క్రమ పద్ధతిలో వెళ్తుందో లేదో తెలుస్తుంది. ఆ సమయంలో సాధారణంగా హార్ట్ రేట్ 60 నుంచి 100 బీట్స్ మధ్య ఉంటుంది. ఆ తర్వాత వాకింగ్ చేసేటప్పుడు హార్ట్ రేట్ ను చూసుకోవాలి. చాలా మంది ట్రైనర్లు చెబుతున్న దాని ప్రకారం మీరు నడిచే సమయంలో హార్ట్ రేట్ 110 బీట్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే కాలరీలు బర్న్ అవుతాయి.. ఇది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి..
ఈ వాచ్ లో మరో ఫీచర్ సిట్టింగ్ మోనిటర్స్. మీరు కూర్చొని పని చేసే గంటలను ఇది లెక్కిస్తుంది. ప్రతి అరగంటకు మిమ్మల్ని పైకి లేచి నడవండని రిమైండ్ చేస్తుంది. కనీసం ఐదు నుంచి ఏడు నిమిషాలు అటు ఇటు నడవడం వల్ల మీ శరీరంతో పాటు కళ్లు కూడా స్క్రీన్ నుంచి రిలాక్స్ అవుతాయి…
మీరు వాచ్ ను చేతికి ధరించి నిద్ర సమయాన్ని లెక్కించాలి. అందులో గాఢ నిద్ర, సాధారణ నిద్రను కూడా గణించాలి. వెయిట్ లాస్ కి మంచి ఆహారం, వ్యయామంతో పాటు నిద్ర కూడా చాలా అవసరమని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. రోజులో కనీసం 7 నుంచి 8 ఎనిమిది గంటలు నిద్ర మనిషికి అవసరం.. రెండు మూడు గంటలు గాఢ నిద్ర అవసరం..చివరిగా అన్ని స్మార్ట్ వాచ్ లలో ఉండే ఫీచర్ అడుగులను లెక్కించడాన్ని బాగా వినియోగించుకోవాలి. ప్రతి రోజూ 10,000 అడుగులు నడవడం సాధ్యం కాదు.. చిన్నగా సెట్ చేసుకోండి.. సులువుగా బరువును తగ్గుతారు..ఇప్పటినుండి అయిన ఇలా ప్లాన్ చేసుకొని సులువుగా బరువును తగ్గండి..