ఈనెల 6 నుంచి అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్ట్ మొదలు కానుంది. తొలి టెస్టులో గెలిచిన టీమిండియా.. ఈ టెస్టులోనూ విక్టరీ సాధించాలని చూస్తోంది. అయితే.. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మోకాలికి గాయమైంది.
కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుల్గామ్ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న టూరిస్ట్ వాహనం ఒక్కసారిగా లోయలో జారి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కుల్గాం జిల్లాలోని నిపోరా ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పంజాబ్ వాసులు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికాకు చెందిన F-16 యుద్ధ విమానం దక్షిణ కొరియాలో కూలిపోయింది. శిక్షణ సమయంలో విమానం ప్రమాదానికి గురైందని యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని వెంటనే సమీపంలోకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. నివేదికల ప్రకారం.. గన్సన్‌లోని యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. “సియోల్‌కు దక్షిణంగా 178…
త్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు మావోలు దుశ్చర్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత దంతెవాడ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
బంగ్లాదేశ్ రాజధాని సమీపంలో సోమవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 100 మందికి గాయాలయ్యాయి. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. కిషోర్‌గంజ్‌లోని భైరబ్ వద్ద మధ్యాహ్నం గూడ్స్ రైలు ప్యాసింజర్ రైలును ఢీకొట్టిందని చెబుతున్నారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జాతీయ రహదారి-16పై ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కును బస్సు ఢీకొనడంతో నేపాల్‌కు చెందిన 20 మంది యాత్రికులు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. సోరో పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలానగర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 61 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆగిఉన్న ట్రక్కును.. బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మరో బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. కూచ్‌బెహార్‌లోని దిన్‌హటాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ బాంబు పేలుడు ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.