గత కొద్ది రోజులుగా అమెరికా యూనివర్సిటీలు పాలస్తీనా అనుకూల ఉద్యమాలతో దద్దరిల్లుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనలు, నిరసనలు చేపట్టడంతో పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడే విద్యార్థులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అలాగే యూనివర్సిటీలు.. విద్యార్థులపై వేటు కూడా వేశాయి. ఏప్రిల్ 18న ప్రారంభమైన ఉద్యమం.. మరోసారి ఉధృతం చేశారు. తాజాగా వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో గుడారాలు వేసి నిరసనలు చేపట్టారు. తక్షణమే ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి డజన్ల కొద్దీ విద్యార్థులను అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ హెడ్ ఎలెన్ గ్రాన్‌బర్గ్ నివాసం దగ్గర ఆందోళనకారులు మార్చ్ చేపట్టడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Dushyant Chautala: హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్కి మద్దతు ఇస్తా..
మరోవైపు ఆందోళన విరమించాలని ఆందోళనకారులకు పోలీసులు హెచ్చరించారు. యూనివర్శిటీ క్యాంపస్‌లో నిరసన తెలిపిన విద్యార్థులు.. నినాదాలు చేస్తూ గ్రాన్‌బర్గ్ నివాసానికి వెళ్లి పాలస్తీనా స్వాతంత్ర్యంపై ప్రసంగించారు. ఇప్పటి వరకు అమెరికాలోని 50 విద్యా సంస్థలకు చెందిన 2,600 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. బుధవారం ఉదయం ఆందోళనకారులకు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Goa: గోవా సీఎం మానవత్వం.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితుడికి సాయం
స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. నిరసనకు దిగుతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. విద్యార్థులు కారం చల్లారు. దీంతో పోలీసులు దాదాపు 30 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. క్యాంపస్‌లో నిరంతర ప్రదర్శనలు, ధర్నాల కారణంగా చదువులకు అంతరాయం కలుగుతున్నందున నిరసన తెలిపిన విద్యార్థులను సస్పెండ్ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
ఏప్రిల్ 18 నుంచి పాలస్తీనియన్లకు మద్దతుగా ఉద్యమం కొనసాగుతోంది. మంగళవారం చికాగో యూనివర్శిటీ దగ్గర కూడా ఇదే రీతిలో నిరసన చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. క్యాంపస్‌లో భద్రతాపరమైన ముప్పు తలెత్తడంతో పోలీసులను రంగంలోకి దింపినట్లు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అయితే శాంతియుత నిరసనలకు విశ్వవిద్యాలయం మద్దతు తెలిపింది.
న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో నిరసన ముగిసిన తర్వాత కూడా పాలస్తీనా అనుకూల విద్యార్థుల ఉద్యమం కొనసాగుతోంది. గాజాలో యుద్ధాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ క్యాంపస్‌లో పలుమార్లు నినాదాలు చేశారు.
ఇది కూడా చదవండి: Pakistan : పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ.. 25 మందికి పైగా గాయాలు