గత కొద్ది రోజులుగా అమెరికా యూనివర్సిటీలు పాలస్తీనా అనుకూల ఉద్యమాలతో దద్దరిల్లుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనలు, నిరసనలు చేపట్టడంతో పోలీసులు ఉక్కుపాదం మోపారు.
పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడు గోల్డీబ్రార్ చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని అమెరికా కొట్టిపారేసింది. కెనడాకు చెందిన గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తెలిపారు.
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఒహియోలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
అగ్రరాజ్యమైన అమెరికాలో నల్లజాతీయులపై దాడులు ఆగడం లేదు. యూఎస్‌లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. మే 2020లో జార్జ్ ఫ్లాయిడ్ అనే యువకుడిని పోలీసులు చితకబాదడంతో అతను మరణించిన సంగతి తెలిసిందే.
కొన్ని ప్రాంతాల్లో మనుషులే కాదు.. ఏదైనా జంతువు, పక్షులు తిరిగినా అనుమానించే పరిస్థితులు ఉంటాయి.. ఇలాంటి వింత పరిస్థితి ఓ కోడికి ఎదురైంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది అగ్రరాజ్యం అమెరికా.. ఆ కోడి తిరిగిన ప్రదేశం.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్.. అదే ఆ కోడి చేసిన పాపం అయ్యింది.. వెంటనే రంగంలోని దిగిన పోలీసులు.. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ కోడిని పట్టుకుని.. స్టేషన్‌లో పెట్టారు.. ఆ తర్వాత క్షుణ్ణంగా ఆ కోడికి పరీక్షలు నిర్వహించారు.…