Ambati Rambabu: మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా.. రాష్ట్రంలో పాలన ఉంది అంటూ కూటమి సర్కార్‌పై మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ప్రతిరోజూ వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును చంపేందుకు ప్రయత్నించారు. పొన్నూరు ఎమ్మెల్యేకి తెలియకుండానే ఈ హత్యాయత్నం జరిగిందా? అని ప్రశ్నించారు. ఆ నిందితులను ఎమ్మెల్యేనే రక్షించి ఊరు దాటించేశారు అని ఆరోపించారు.. రెడ్ బుక్ ను కొనసాగించేందుకు కొందరు అధికారులు, రిటైర్డ్ అయినవారు కలిసి అజ్ఞాతంగా పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపాలని చూడడం లేదు. అజ్ఞాత వ్యక్తులు మాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.. పల్నాడులోని గుండ్లపాడులో టీడీపీలోని రెండు వర్గాలు గొడవ పడి చంపుకుంటే మా పార్టీ నేతలపై కేసులు పెట్టారు. ఎస్పీ ఒకమాట చెప్తే తర్వాత మళ్లీ మాట మార్చి మాపార్టీ వారు నిందితులన్నారు అని మండిపడ్డారు.
Read Also: IND vs ENG: ప్రతిఘటిస్తున్న ఇంగ్లాండ్.. మెరిసిన డీఎస్పీ సిరాజ్
ఇక, సింగయ్యను ప్రయివేటు కారు ఢీకొట్టి చనిపోయాడని తొలుత ఎస్పీ చెప్పారు. ఆ తర్వాత జగన్ కారే ఢీకొట్టిందంటూ ఆయన మీద కూడా కేసు పెట్టారు. అసలు, సింగయ్యను ఆస్పత్రికి తరలించటానికి 40 నిమిషాలు ఎందుకు ఆలస్యం చేశారు? అని నిలదీశారు రాంబాబు.. అంబులెన్స్ లో ఎక్కక ముందు చక్కగా మాట్లాడిన వ్యక్తి ఆ తర్వాత ఎలా చనిపోయారు? పోలీసు వ్యవస్థను ఇంత దారుణంగా వాడుకోవటం సబబేనా?చంద్రబాబుకు అసలు బుద్ది, జ్ఞానం ఉందా? అని ఫైర్ అయ్యారు.. అజ్ఞాతమైన టీమ్ తో దారుణాలు ఎలా చేయిస్తున్నారో మాకు తెలుసు.. వారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు..