మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘గాంధీ టాక్స్’ . ఇది ఒక మూకీ సినిమా (డైలాగులు ఉండవు). కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం విశేషం. ఇక విజయ్ కేవలం నటన మాత్రమే కాదు, ఆయన ఇచ్చే సమాధానాలు కూడా చాలా ప్రాక్టికల్‌గా, ఫన్నీగా ఉంటాయి. అయితే తాజాగా ‘గాంధీ టాక్స్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఏఆర్ రెహమాన్, అదితి రావు హైదరీలతో కలిసి ఆయన ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ లో పాల్గొని తనదైన చమత్కారంతో అందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు.
Also Read : Anasuya : అనసూయకు గుడి కడతా.. పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్ అంటూ పూజారి షాకింగ్ కామెంట్స్
షోలో భాగంగా కపిల్ శర్మ.. ‘మీరు ఎప్పుడైనా యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లారా?’ అని ప్రశ్నించగా, విజయ్ సేతుపతి తాను ఒక నాటక బృందంలో అకౌంటెంట్‌గా పనిచేశానని చెప్పారు. దానికి కపిల్ స్పందిస్తూ.. ‘మరి అక్కడ పని చేస్తున్నప్పుడు ఎవరైనా పెద్ద నటుడి బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ఇన్‌స్పైర్ అయ్యి హీరో అయ్యారా?’ అని సరదాగా అడిగారు. దీనికి సేతుపతి ఇచ్చిన రిప్లై అదిరిపోయింది. ‘లేదు, నేను నా బ్యాంక్ అకౌంట్ చూసుకున్నాను.. అందులో ఒక్క రూపాయి కూడా లేదు. అందుకే డబ్బు సంపాదించడానికే నటుడిగా మారాను’ అని నిజాయితీగా చెప్పడంతో కపిల్ శర్మతో పాటు సెట్‌లోని వారంతా పగలబడి నవ్వారు. విజయ్ సేతుపతి ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ఎదిగినా, తన గతాన్ని ఇంత సరదాగా చెప్పుకోవడం విజయ్ సేతుపతికే సాధ్యమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.