Amazon: అమెజాన్ కొత్త పాలసీ.. అయోమయంలో ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు ఉద్యోగుల పని విషయంలో చూసిచూడనట్లు ఉన్న.. ఈ-కామర్స్ సంస్థ.. ప్రస్తుతం.. కఠినంగా వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగా ఉద్యోగులు వారానికి మూడు రోజులు తప్పని సరిగా ఆఫీస్‌కు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే, యాజమాన్యం చెప్పినట్లు చేయకపోతే తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, గత ఏడాది నుంచి అమెజాన్ ఉద్యోగుల్ని తొలగించడమే ఇందుకు ప్రధాన కారణం.
Read Also: Heavy Rains: జమ్మూ కాశ్మీర్లో ఎడతెరిపిలేని వానలు.. ఇబ్బందులు పడుతున్న జనాలు
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్‌పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
ఇక, ఉద్యోగులు ఆఫీస్ నుంచి పని చేయాలంటూ అమెజాన్ ఆదేశాలు జారీ చేసినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది. మరి వారానికి ఎంతమంది ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.. బహుశా..! కరోనా నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్‌కి పరిమితమైన ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా అమెజాన్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుల నుంచే పనిచేయడం వల్ల మరింత ఉత్సాహంతో పనిచేయడంతో పాటు తోటి ఉద్యోగులతో సన్నిహిత సంబంధాలు, వ్యాపార వృద్ది మెరుగు పడుతుందనే ఆయన చెప్పాడు.
Read Also: BRICS: వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు.. రష్యా విదేశాంగ శాఖ కీలక ప్రకటన
దీంతో అమెజాన్ సంస్థ తీసుకునే రోజువారీ నిర్ణయాలు నేరుగా ఉద్యోగులతో చర్చించే వెసులు బాటు కలుగుతుందని సంస్థ అధికారి తెలిపారు. అయినప్పటికీ, అమెజాన్‌లో ఉద్యోగులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ ఏడాది అమెజాన్ సంస్థ 27 వేల మంది ఎంప్లయిస్న్ ఇంటికి పంపించింది. తన కార్పొరేట్ వర్క్ ఫోర్స్‌లో అధిక శాతం వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి రావాలని వెల్లడించింది. అయితే, సంస్థ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సియోటల్లో ఉద్యోగులు నిరసన చేశారు. ఈ క్రమంలో కంపెనీ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Rashmika Mandanna : నేషనల్ క్రష్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
అయితే, మరోవైపు దేశీయ టెక్ కంపెనీలైన టీసీఎస్, విప్రో,హెచ్‌సీఎల్‌లు ఉద్యోగులు ఆఫీస్ రావాలని గట్టి ఆదేశాలను జారీ చేశాయి. ఇప్పటికే 50 శాతానికి పైగా ఉద్యోగులు కార్యాలయలకు వచ్చి పనిచేస్తున్నారని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అందరూ ఉద్యోగులు ఆఫీసులకు వస్తారని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
-
Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్‌పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!