దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు ఉద్యోగుల పని విషయంలో చూసిచూడనట్లు ఉన్న.. ఈ-కామర్స్ సంస్థ.. ప్రస్తుతం.. కఠినంగా వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగా ఉద్యోగులు వారానికి మూడు రోజులు తప్పని సరిగా ఆఫీస్‌కు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.