హనీమూన్ మర్డర్ కేసులో బాధిత కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితురాలు సోనమ్ రఘువంశీ.. భర్తను ఎందుకు చంపాల్సి వచ్చిందో తెలుసుకోవాలని బాధిత కుటుంబం నిర్ణయానికి వచ్చింది.
భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని రైలు బోగీల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రైలు బోగీల ఎంట్రెన్స్‌లో కెమెరాలు అమర్చనున్నారు.
కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించాలని భారత్-పాకిస్థాన్ నిర్ణయించాయి. ఈనెల 10న డీజీఎంవోలు మధ్య కుదిరిన అవగాహనను కొనసాగించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు కొనసాగించాలని ఇరు దేశాల డీజీఎంవోలు నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్ నెట్‌లో ఇప్పటి వరకు 600 మందిని తొలగించాం.. త్వరలోనే సంస్థ విస్తరణ చేయనున్నామని తెలిపారు. సంస్థలో తొలగించిన వారి స్థానంలో మళ్ళీ ఉద్యోగాలు ఇస్తామని అన్నారు.
ఏపీ ప్రభుత్వం ఆర్ధిక శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా ఉన్న బకాయిలు బిల్లులు రూ.6,700 కోట్లకు పైగా ఉన్న వాటిని చెల్లించడానికి ఆదేశాలు ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆర్ధిక శాఖపై ప్రత్యేక సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసాపై ఈరోజు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చించారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ చట్టంలో మార్పులు చేర్పులు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.. ఈరోజు హైడ్రాకు సంబంధించి కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైడ్రాకు చట్ట బద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు.. కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అనంతరం ఆర్డినెన్సు పై సంతకం కోసం రాజ్ భవన్‌కి ఫైల్ పంపించిన ప్రభుత్వం.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్సు పై సంతకం చేశారు.
కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ చుట్టూ అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు, సిగ్నళ్లు, యూటర్న్‌లు లేకుండా చర్యలు చేపట్టింది. 826 కోట్ల రూపాయలతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు పాలనాపరమైన అనుమతులిచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్‌లో చనిపోయిన కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనుంది. ఈ క్రమంలో.. గల్ఫ్ కార్మికుల వెల్ఫేర్ కోసం అడ్వైజరి కమిటీ నియామకం కానుంది.