ఆన్ లైన్ షాపింగ్ లవర్స్ గెట్ రెడీ.. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చే్స్తోంది. కళ్లు చెదిరే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 త్వరలో భారత్ లో ప్రారంభం కానుంది. ఈ-కామర్స్ సైట్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీని ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి పర్సనల్ కంప్యూటర్‌లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్‌ల, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.
Also Read:Pakistan: పాకిస్తాన్ ఆర్మీలో భయం భయం.. కుటుంబాలను యూకే తరలిస్తున్న అధికారులు..
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 వినియోగదారులకు మే 1న మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దీనిని అమెజాన్ లైవ్ మైక్రోసైట్ ధృవీకరించింది. దేశంలోని అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఈ సేల్‌లో 12 గంటల ముందుగానే డీల్‌లను పొందుతారు. అంటే, ప్రైమ్ వినియోగదారులకు డిస్కౌంట్ డీల్‌లు మే 1 అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఈ సేల్ సమయంలో, HDFC బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు పొందొచ్చు. అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను పొందగలరు.
Also Read:Harsha Kumar: ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు.. ఘటనా స్థలంలో బహిరంగసభ..
రాబోయే సేల్ ఈవెంట్‌లో భాగంగా, అమెజాన్ గిఫ్ట్ కార్డులతో షాప్ కీపర్స్ అదనంగా 10 శాతం ఆదా చేసుకోగలరు. దీనితో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉంటాయి. విడుదలైన టీజర్ ప్రకారం, Samsung Galaxy S24 Ultra, Galaxy A 55 5G, Galaxy M35 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లు ఈ సేల్ సమయంలో తగ్గింపు ధరలకు లభిస్తాయి. ఇతర శామ్‌సంగ్ హ్యాండ్‌సెట్‌లతో పాటు షియోమి, ఒప్పో, వివో ఇతర బ్రాండ్‌ల ఫోన్‌లు కూడా తక్కువ ధరలకు అందుబాటులో ఉండనున్నాయి. లెనోవా, ఆసుస్, హెచ్‌పి వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి ల్యాప్‌టాప్‌లను తక్కువ ధరలకు అందించనున్నట్లు అమెజాన్ మైక్రోసైట్ సూచిస్తుంది. స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండిషనర్లు వంటి గృహోపకరణాలు సాధారణం కంటే తక్కువ ధరలకు లభిస్తాయని భావిస్తున్నారు.