పుష్ప -2 విజయంతో బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అల్లు అర్జున్ ప్రస్తుతం.. పాన్-ఇండియా లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఐకాన్ స్టార్‌కి అభిమానులు కూడా అదే రేంజ్‌లో ఉన్నారు. అల్లు అర్జున్-స్నేహ రెడ్డి నేడు 14వ పెళ్లిరోజును తమ నివాసంలో నిర్వహించుకున్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకు కేకు కట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.